విజయవాడ, వరంగల్ ప్రజలకు నరేంద్రమోడీ గుడ్ న్యూస్

ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ 'కాశీ తమిళ్ సంగమం' రెండో ఎడిషన్‌ను ఘనంగా ప్రారంభించారు. డిసెంబర్ 17 నుంచి 30వతేదీ మధ్యన కాశీ తమిళ్ సంగమంలో భాగంగా వారణాసికి రైల్వేశాఖ పలు రైళ్లను నడపనుంది. కన్యాకుమారి, ఎంజీఆర్ చెన్నై సెంట్రల్, కొయంబత్తూర్ జంక్షన్ నుంచి బయలుదేరతాయి. ఇవి విజయవాడ, వరంగల్ మీదగా ప్రయాణిస్తాయి.

నెంబర్ 06102 వారణాసి నుంచి చెన్నై సెంట్రల్ రైలు డిసెంబర్ 20వ తేదీ రాత్రి 11.20 గంటలకు వారణాసిలో బయలుదేరి, 22వ తేదీ సాయంత్రం 4.45 గంటలకు చెన్నై చేరుకుంటుంది. 22 తెల్లవారుజామున 4.45 గంటలకు వరంగల్, ఉదయం 9.00 గంటలకు విజయవాడ చేరుకుంటుంది.

chennai central to varanasi special trains details

నెంబర్ 06104 వారణాసి నుంచి కన్యాకుమారి రైలు 22న రాత్రి 11.20 గంటలకు వారణాసిలో బయలుదేరి, 25 ఉదయం 11.50 గంటలకు కన్యాకుమారి చేరుకుంటుంది. 24వ తేదీ తెల్లవారుజామున 4.45 గంటలకు వరంగల్, ఉదయం 9.00 గంటలకు విజయవాడ చేరుకుంటుంది.

నెంబర్ 06105 కొయంబత్తూర్ నుంచి వారణాసి రైలు 19వ తేదీ తెల్లవారుజామున 4.30 గంటలకు కొయంబత్తూర్‌లో బయలుదేరి 20వ తేదీ తెల్లవారుజామున 4.30 గంటలకు వారణాసి చేరుకుంటుంది. 19వతేదీ రాత్రి 9.45 గంటలకు విజయవాడ, అర్ధరాత్రి 12.30 గంటలకు వరంగల్ చేరుకుంటుంది.

నెంబర్ 06106 వారణాసి నుంచి కొయంబత్తూర్ రైలు 24వ తేదీ రాత్రి 11.20 గంటలకు వారణాసిలో బయలుదేరి 27వ తేదీ అర్ధరాత్రి 2.30 గంటలకు కొయంబత్తూర్ చేరుకుంటుంది. 26వ తేదీ తెల్లవారుజామున 4.45 గంటలకు వరంగల్, ఉదయం 9.00 గంటలకు విజయవాడ చేరుకుంటుంది.

నెంబర్ 06107 కన్యాకుమారి నుంచి వారణాసి రైలు 20వ తేదీ రాత్రి 8.55 గంటలకు కన్యాకుమారిలో బయలుదేరి, 22వ తేదీ తెల్లవారుజామున 4.30 గంటలకు వారణాసి చేరుకుంటుంది. 21 రాత్రి 7.40 గంటలకు విజయవాడ, రాత్రి 10.50 గంటలకు వరంగల్ చేరుకుంటుంది.

నెంబర్ 06108 వారణాసి నుంచి కన్యాకుమారి రైలు 26వ తేదీ రాత్రి 11.20 గంటలకు వారణాసిలో బయలుదేరి 29వ తేదీ ఉదయం 11.50 గంటలకు కన్యాకుమారి చేరుకుంటుంది. 28వ తేదీ తెల్లవారుజామున 4.45 గంటలకు వరంగల్, ఉదయం 9.00 గంటలకు విజయవాడ చేరుకుంటుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+