జగన్ పార్టీ ఎమ్మెల్యే చెవిరెడ్డి గృహ నిర్బంధం: ఉద్రిక్తత, 144 సెక్షన్ విధింపు

తిరుపతి: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని శుక్రవారం హౌజ్ అరెస్ట్ చేయడంతో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో పోలీసులు సి రామాపురంలో 144 సెక్షన్ విధించారు పోలీసులు. ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో భారీగా పోలీసు బలగాలు మోహరించాయి.

కాగా, గత మూడు రోజులుగా రామాపురంలోని డంపింగ్ యార్డును ఎత్తివేయాలని గ్రామస్తులతో కలిసి చెవిరెడ్డి రోడ్డుపైనే బైఠాయించి, నిరవధిక నిరసనకు దిగిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో శుక్రవారం నిరవధిక నిరసన దీక్షను పోలీసులు భగ్నం చేశారు.

chevireddy bhaskar reddy house arrest in C Ramapuram

చెవిరెడ్డి హౌజ్ అరెస్టుతో సి రామాపురంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో పోలీసులు సుమారు 50మంది వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను అరెస్ట్ చేశారు. నిరసనలో పాల్గొన్న పలువురు మహిళా కార్యకర్తలను కూడా పోలీసులు అక్కడ్నుంచి తరలించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+