భారీగా పెరిగిన చికెన్ ధర

మాంసాన్ని ఇష్టంగా తినేవారికి ఇది ఒకరకంగా చేదువార్తవుతుంది. ఎందుకంటే చికెన్ ధరలు పెరిగాయి. కార్తీక మాసం చివరి వరకు కేజీ రూ. 120 పలకగా, ప్రస్తుతం దాని ధర ఒక్కసారిగా డబుల్ అయింది. కార్తీక మాసం ముగియడంతో మాంసం ప్రియులు చికెన్ షాపుల ముందు బారులు తీరారు. రెండు తెలుగు రాష్ట్రాల్లోను ఇదే పరిస్థితి.

ఈనెల 12న కార్తీక మాసం ముగిసింది. అప్పటివరకు చికెన్ ధర కేజీ రూ.150గా ఉంది. మరికొన్ని ప్రాంతాల్లో రూ.120కే లభించింది. కార్తీక మాసం ముగియటంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో స్కిన్‌ లెస్‌ చికెన్ కిలో రూ.240 అయింది. పెళ్లిళ్ల సీజన్‌ మొదలైంది. క్రిస్మస్, న్యూయర్‌ పండుగలు కూడా ఉండడంతో చికెన్‌ ధరకు రెక్కలు వచ్చాయని విశ్లేషకులు భావిస్తున్నారు. డిమాండ్‌కు తగ్గట్లుగా సప్లై లేకపోవటం కూడా ధరల పెరుగుదలకు కారణమని వ్యాపారులు స్పష్టత ఇస్తున్నారు. రానున్న రోజుల్లో మరింత పెరిగే అవకాశం ఉందంటున్నారు. కూరగాయల ధరలు కూడా ఆకాశాన్ని అంటుతున్నాయి. మరోవైపు కేజీ మటన్ రూ. 800 నుంచి రూ. 1000 పలుకుతోంది.

chicken prices are increasing

నాన్‌ వెజ్‌ ప్రియుల డిమాండ్‌ ను దృష్టిలో పెట్టుకొని రానున్న రోజుల్లో చికెన్‌ ధరలు ఇంకా పెరగనున్నాయి. ఈ కాలంలో మాంసం వినియోగం అధికంగా ఉంటుంది. దీనివల్ల చికెన్‌ ధరలు మరింత పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. కార్తీక మాసం ముగిసిన తర్వాత నుంచి చికెన్ షాపులు, మటన్ షాపులు వినియోగదారులతో కళకళలాడుతున్నాయి. చికెన్ ధర భవిష్యత్తులో మరింత ఎక్కువయ్యే అవకాశం ఉందటున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+