మాట నిలబెట్టుకున్న చంద్రబాబు, సీఎం మాట ఇస్తే అంతే
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తాను చెప్పిన మాటను నిలబెట్టుకుంటానని మరోసారి నిరూపించుకున్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మంగళవారం కర్నూలు జిల్లా పర్యటన సందర్భంగా పలువురుని నుంచి వినతి జ్ఞాపకాలు స్వీకరించారు. పత్తికొండ మండలం పరిధిలోని పుచ్చకాయలమడ ప్రాంతంలో సీఎం చంద్రబాబు నాయుడు పర్యటించారు.
ఆ సందర్భంలొ స్థానికంగా నివాసం ఉంటున్న తలారి గంగమ్మ అనే మహిళ కుమారుడు అశోక్ తో సీఎం చంద్రబాబు నాయుడు మాట్లాడారు. ఈ సందర్భంగా అశోక్ ఆయన కష్టాలను, ఆయన కుటుంబ సమస్యల గురించి సీఎం చంద్రబాబు నాయుడుకు చెప్పారు. నీకు త్వరలోనే ఎలక్ట్రిక్ ఆటో తీస్తానని సీఎం చంద్రబాబు నాయుడు అక్కడే తలారి గంగమ్మ కుమారుడు అశోక్ కి మాట ఇచ్చారు. సీఎం చంద్రబాబు నాయుడు మాట ఇచ్చిన 24 గంటల్లోనే అశోక్ ఇంటి ముందు 3.80 లక్షల రూపాయల విలువైన ఎలక్ట్రిక్ ఆటో ప్రత్యక్షమైంది.

స్థానిక ఎమ్మెల్యే శ్యాంబాబు, కర్నూలు జిల్లా కలెక్టర్ రంజిత్ భాషా బుధవారం అశోక్ ఇంటి దగ్గరికి వెళ్లి ఎలక్ట్రిక్ ఆటోని అశోక్ అందించారు. సీఎం చంద్రబాబు నాయుడు మాట ఇచ్చిన 24 గంటల్లోనే తన కుమారుడు అశోక్ కి అధికారులను ఎలక్ట్రిక్ ఆటో ఇచ్చారని, మా కుటుంబం కష్టాల నుండి బయటపడటానికి సహకరించిన సీఎం చంద్రబాబు నాయుడుకి కృతజ్ఞతలు అని తలారి గంగమ్మ మీడియాకు చెప్పారు.
మంగళవారం సీఎం చంద్రబాబు నాయుడును కలిసిన కవిత అనే మహిళ తన భర్త ఆరోగ్య ఖర్చులకోసం లక్ష రూపాయలు ఆర్థిక సహాయం చేయాలని మనవి చేసింది. అదే సమయంలో సీఎం చంద్రబాబు నాయుడు కవిత భర్తకు లక్ష రూపాయలు ఇస్తామని హామీ ఇచ్చారు. చంద్రబాబు నాయుడు హామీ మేరకు కర్నూలు జిల్లా కలెక్టర్ రంజిత్ భాషా ఎమ్మెల్యే శ్యాంబాబు బుధవారం కవిత ఇంటికి వెళ్లి ఆమెకు లక్ష రూపాయలు అందించారు. సీఎం చంద్రబాబు నాయుడు కర్నూలు జిల్లా పర్యటన సందర్భంగా పలువురిని కలుసుకుని వారికి ఇచ్చిన హామీలను 24 గంటల్లోనే నెరవేర్చడంతో స్థానిక ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.












Click it and Unblock the Notifications