ఇజ్రాయెల్ లో ఇంజినీర్ అవతారం ఎత్తిన వైఎస్ జగన్
అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇజ్రాయెల్ లో ఇంజినీర్ అవతారం ఎత్తారు. వ్యక్తిగత పర్యటనే అయినప్పటికీ.. రాష్ట్రానికి అవసరరమైన సాంకేతికతను తెలుసుకోవడానికి ఆయన వెనుకాడట్లేదు. పర్యటన ఆరంభంలోనే వైఎస్ జగన్ అక్కడి రైతులతో మాట్లాడారు.

తక్కువ నీటి సౌకర్యంతో వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చుకునే అంశంపై, డ్రిప్ ఇరిగేషన్ కు సంబంధించిన ఆధునిక సాంకేతికత గురించి వారిని అడిగి తెలుసుకున్నారు.

సముద్రపు నీటిని మంచినీటిగా మార్చే హెచ్2ఐడీ కేంద్రాన్ని పరిశీలించారు. సముద్రపు ఉప్పు నీటిని తాగడానికి వీలుగా శుద్ధి చేసే ప్లాంట్ అది. దాని పనితీరుపై వైఎస్ జగన్ ఆరా తీశారు. టెల్ అవీవ్ సమీపంలోని హదేరా ప్రాంతంలో ఉందీ కేంద్రం. ఉప్పునీటిని మంచినీటిగా మార్చే ప్రక్రియపై ఆ ప్లాంట్ సీనియర్ ఎగ్జిక్యూటివ్ రఫీ షమీర్ వైఎస్ జగన్ కు పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చారు. ముఖ్యమంత్రి వెంట ఇరాన్ భారత మిషన్ డిప్యూటీ కమిషనర్ షెరింగ్ డబ్ల్యూ షెర్పా ఉన్నారు.












Click it and Unblock the Notifications