కొడాలి నాని - వంశీ పేర్లు చెప్పాలి : సుపారీ ఇచ్చి చంపేస్తాం - చీకోటికి బెదిరింపులు..!!

రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన క్యాసినో వ్యవహారంలో కొత్త అంశాలు వెలుగు లోకి వస్తున్నాయి. ఇదే వ్యవహారంలో ఈడీ విచారణ ఎదుర్కొన్న చీకోటి ప్రవీణ్ కీలక అంశాలను బయట పెట్టారు. ప్రవీణ్ తో పాటుగా మాధవరెడ్డి నివాసాల్లో సోదాలు నిర్వహించిన ఈడీ ఆ తరువాత వారిని విచారణకు పిలిచింది. ఆ విచారణ సమయంలో ప్రధానంగా క్యాసినో నిర్వహణ కోసం జరిగిన నగదు లావాదేవీలు.. హవాలా ..మనీలాండరింగ్ జరిగిందా అనే కోణంలో విచారించినట్లుగా తెలిసింది. ఇక, ఇదే సమయంలో చీకోటి ప్రవీణ్ తో రాజకీయంగా ఉన్న సంబంధాలు చర్చకు కారణమయ్యాయి.

నాని - వంశీ పేర్లు చెప్పాలంటూ

నాని - వంశీ పేర్లు చెప్పాలంటూ

ఇదే విషయం పైన స్పందించిన చీకోటి.. ఈడీ విచారణ సమయంలో మాజీ మంత్రి కొడాలి నాని, ఎమ్మెల్యే వల్లభనేని వంశీ పేర్లు చెప్పాలని పదేపదే బెదిరింపు ఫోన్‌కాల్స్‌ వస్తున్నాయని చెప్పారు. ఆ ఇద్దరి పేర్లు చెప్పకపోతే తనని చంపేందుకు సుపారీ ఇస్తున్నట్టు బెదిరిస్తున్నారని చీకోటి ప్రవీణ్‌ ఒక న్యూస్ ఛానల్ ఇంటర్వ్యూలో వెల్లడించారు. ఆ బెదిరింపుల వెనుక ఎవరు ఉన్నారనేది పోలీసులు తేల్చాల్సి ఉందని వివరించారు. తాను తెలుగు రాష్ట్రాల్లో క్యాసినో చేయటం లేదని.. ఎక్కడైతే క్యాసినో లీగల్ గా ఉందో అక్కడే వ్యాపారం చేస్తున్నట్లు చెప్పుకొచ్చారు. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ తనకు వ్యక్తిగతంగా రాజకీయ నేతల్లో స్నేహితులు ఉన్నారని చెప్పారు.

సంబంధం లేని వ్యక్తులు

సంబంధం లేని వ్యక్తులు

అంత మాత్రాన వారికి క్యాసినోతో సంబంధాలు ఉన్నాయని చెప్పటం.. సంబంధం లేని వ్యక్తులను ఈ వ్యహారాల్లోకి తీసుకురావటం సరి కాదన్నారు. నేపాల్‌ క్యాసినో వ్యవహారంలో ఇద్దరు మాజీ ఎమ్మెల్యేలు తప్ప పెద్దగా ఎవరు రాలేదని, పలువురు సినీ ప్రముఖులకు తాను కోట్ల రూపాయలు చెల్లించినట్టు వస్తున్న వార్తల్లో నిజంలేదని స్పష్టంచేశారు. తన ఫాం హౌస్ లో జంతువులను ..పక్షులను పెంచటం పైనా చీకోటి క్లారిటీ ఇచ్చారు. ఈడీ విచారణ సమయంలో ఆర్దిక లావాదేవీలకు సంబంధించిన పూర్తి వ్యవహారాలను అందించానన్నారు. తాను జంతు ప్రేమికుడినని చెప్పిన చీకోటి.. నుమతి తీసుకునే పలు జంతువులు, పక్షులను పెంచుతున్నట్టు చెప్పారు.

భద్రత కల్పించాలని కోరుతూ

భద్రత కల్పించాలని కోరుతూ

తన భద్రత విషయంలో ఇప్పటికే తాను కోర్టుకు వెళ్లానని.. హైదారాబాద్ పోలీసులు ఆ దిశగా చర్యలు చేపట్టాలని అభిప్రాయ పడ్డారు. తనకు భద్రత కల్పించకుంటే తాను మరోసారి కోర్టు మెట్లు ఎక్కాల్సి ఉంటుందన్నారు. ఈడీ విచారణకు తాను పూర్తిగా సహకరిస్తున్నానని చీకోటి వెల్లడించారు. అయితే, తాజాగా.. మాజీ మంత్రి కొడాలి నాని ఇదే తరహాలో స్పందించారు. తనతో పాటుగా వంశీ పేరు క్యాసినో తో సంబంధాలు ఉన్నాయని చెప్పాలంటూ చీకోటీ పైన ఒత్తిడి తెస్తున్నారని చెప్పుకొచ్చారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+