చిలకలూరిపేటలో పీక్స్ కి చేరిన పాలిటిక్స్.. హత్యాయత్నం ?

చిలకలూరిపేటలో రాజకీయాలు రోజురోజుకీ మరింత హీట్ ఎక్కుతున్నాయి. ఎమ్మెల్యే ప్రతిపాటి పుల్లారావు, మాజీ ఎమ్మెల్యే విడదల రజినీ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా పరిస్థితులు మారుతున్నాయి. తాజాగా మాజీ మంత్రి విడదల రజినిపై కోపంతో ఆమె మామపై పుల్లారావు దాడి చేయించారని ఆరోపిస్తూ వైసీపీ సోషల్ మీడియా వేదికగా విమర్శలు గుప్పించింది. 83 ఏళ్ళ వ్యక్తి అని కూడా చూడకుండా.. తన అనుచరులతో కారు అద్దాలను ధ్వంసం చేయించి హత్యాయత్నం చేయించారంటూ ఆ పోస్టులో రాసుకొచ్చింది.

అంతే కాకుండా మరీ ఇంత నీచ రాజకీయాలా అంటూ టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబును ట్యాగ్ చేయడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అలానే ఆ పోస్టులో కారు అద్దాలను ధ్వంసం చేసిన ఫోటోలను సైతం పోస్ట్ చేసింది. దీంతో చిలకలూరిపేట పాలిటిక్స్ వ్యవహారం రాష్ట్రవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది. మరి దీనిపై టీడీపీ ఎమ్మెల్యే ప్రతిపాటి పుల్లారావు ఏ విధంగా స్పందిస్తారో అని డిస్కషన్ నడుస్తోంది.

Chilakaluripet politics getting state wide attention

ఇక ఇటీవలే తన కుటుంబం లక్ష్యంగా పుల్లారావు రాజకీయ వేధింపులకు పాల్పడుతున్నారని విడదల రజనీ ఆరోపించారు. తనది పురుషోత్తపట్నం అని గుర్తు పెట్టుకోవాలని.. వదిలేది లేదని రజనీ వార్నింగ్ ఇచ్చారు. పుల్లారావు అక్రమాలు చేస్తున్నారని.. ఎక్కవ కాలం ఇవి కొనసాగించలేరని చెప్పుకొచ్చారు. తన పార్టీ.. తన కుటుంబం జోలికి వస్తే వదలనని రజనీ హెచ్చరించారు. అంతే కాకుండా తన ఏడేళ్ల రాజకీయంతోనే 25 ఏళ్ల పుల్లారావు రాజకీయం తలదించుకునేలా చేసానని చెప్పుకొచ్చారు.

తాను అయిదేళ్లు చిలకలూరి పేటకు ఎమ్మెల్యేగా.. మంత్రిగా పని చేసానని చెప్పుకొచ్చారు. తానెప్పుడూ ఇలాంటి అరాచక పాలన ప్రోత్సహించలేదన్నారు. తన కుటుంబ సభ్యులతో పాటుగా వైసీపీ కేడర్ పైన అక్రమ కేసులు పెట్టి.. భయపెట్టాలని చూస్తు న్నారని రజనీ మండిపడ్డారు. ఎవరిని వదిలిపెట్టమని..అందరి సంగతి తెలుస్తామని వార్నింగ్ ఇచ్చారు. అక్రమ కేసులకు భయపడమని.. ప్రతీ కేసు బలంగా ఎదుర్కొంటామని రజనీ చెప్పారు. నియోజకవర్గంలో ఇక తాను మరింత బలంగా పని చేస్తానని ప్రకటించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+