ముఖ్యమంత్రిని నిలదీసిన చిన్మయి
సినీ పరిశ్రమలోనే కాకుండా వివిధ రంగాల్లో మహిళలమీద జరిగే అఘాయిత్యాలపై సింగర్ చిన్మయి అలుపెరగని పోరాటం చేస్తోంది. ప్రధానంగా తమిళ పాటల రచయిత వైరముత్తుపై ఆమె చేసిన ఆరోపణలు దక్షిణ భారతదేశంలోనే సంచలనం సృష్టించాయి. ఆమె ఎన్ని ఆరోపణలు చేస్తున్నా వైరముత్తుపై కనీసం చిన్నపాటి చర్యలు కూడా తీసుకోలేదు తమిళ సినీ పరిశ్రమ. సినిమా రంగంతోపాటు రాజకీయ రంగంలో ఉన్న ప్రముఖులతో సన్నిహితంగా ఉండే వైరముత్తు దర్జాగా తిరిగేస్తున్నారని, తనకు ఎవరూ న్యాయం చేయట్లేదని చిన్మయి ఆరోపిస్తోంది.
భారత రెజ్లింగ్ సమాఖ్య అధ్యక్షుడు, భారతీయ జనతాపార్టీ ఎంపీ బ్రిజ్ భూషణ్ శర్‌ణ్ పై మహిళా రెజ్లర్లు లైంగిక వేధింపుల ఆరోపణలు చేశారు. కొన్నాళ్ల నుంచి అతడికి వ్యతిరేకంగా పోరాడుతున్నారు. పార్లమెంటు ఎదుట నిరసనకు ప్రయత్నించగా వారిపై పోలీసులు ఉక్కుపాదం మోపారు. దీన్ని ఖండిస్తూ తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ రెజ్లర్లకు మద్దతుగా ట్వీట్ చేశారు. దీనిపై వెంటనే చిన్మయి స్పందించింది. రెజ్లర్లకు మద్దతు తెలుపుతున్న ముఖ్యమంత్రికి తాను వైరముత్తుపై చేస్తున్న ఆరోపణలు ఎందుకు కనపడటంలేదని ప్రశ్నించారు.

ఎవరికైనా ఒకే నిబంధనలుండాలని, బ్రిజ్ భూషణ్ పై రెజ్లర్లతోపాటు ఒక మైనార్ కూడా వ్యాఖ్యలు చేసిందని, మీ పార్టీతో సన్నిహిత సంబంధాలున్న వైరముత్తుపై తనతో సహా 17 మంది మహిళలు బహిరంగంగా వెల్లడించారు. కెరీర్ ను నాశనం చేశాడని, పరిశ్రమ నుంచి తమను బహిష్కరించేలా చేశాడని ఆరోపించారు. తమకున్న కలలతో పోలిస్తే వైరముత్తు ప్రతిభ గొప్పది కాదన్నారు. అతనిపై చర్యలు తీసుకుంటే తమిళనాడులోని చాలా పని ప్రదేశాలు సరక్షితంగా ఉంటాయన్నారు. వైరముత్తు రాజకీయ అండతో రెచ్చిపోతున్నాడని, అతని వ్యతిరేకంగా తనకు మద్దతివ్వడానికి ఎవరూ ముందుకు రావడంలేదని చిన్మయి ఆవేదన వ్యక్తం చేశారు.












Click it and Unblock the Notifications