సారా సత్తిబాబా నన్ను విమర్శించేది: చినరాజప్ప
కాకినాడ: సారా సత్తిబాబా నన్ను విమర్శించేది అంటూ హోంమంత్రి నిమ్మకాయల చినరాజప్ప ఫైర్ అయ్యారు. తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. టీడీపీ శిక్షణ సదస్సులో లోకేశ్ తనను తిట్టారంటూ వాట్సప్, ఇతర సోషల్ మీడియాలో వైసీపీ నాయకులు అసత్య ప్రచారాలు చేస్తున్నారని రాజప్ప అన్నారు. సోషల్ మీడియాలో తనపై వచ్చిన ఆరోపణలను రాజప్ప ఖండించారు. ఇటువంటి ప్రచారం చేస్తున్న ఇద్దరిని గుర్తించామని, గ్లోబెల్స్ ప్రచారంచేసే వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.












Click it and Unblock the Notifications