కావూరి ఇంటి ఘటన: టిడిపి ఎమ్మెల్యే ప్రభాకర్ అరెస్ట్

ఈ సందర్భంగా చింతమనేని ప్రభాకర్ మాట్లాడారు. కావూరి సాంబశివ రావు తన నాటకాలను ఆపాలని హెచ్చరించారు. తనపై ప్రాథమిక విచారణ జరపకుండానే ఎలా అరెస్టు చేస్తారని ప్రశ్నించారు. ఇది దారుణమన్నారు. సమైక్యాంధ్ర ఉద్యమాన్ని ముందుకు తీసుకు వెళ్తానని చెప్పిన కావూరి పదవి వచ్చాక ఇలా చేశారన్నారు. పోలీసులు ఆయనను ఏలూరు త్రీటౌన్ పోలీసు స్టేషన్‌కు తరలించారు.
కాగా, కావూరి ఇంటి వద్ద మంగళవారం ఉద్రిక్త పరిస్థితి తలెత్తిన విషయం తెలిసిందే. సమైక్యాంధ్రకు మద్దతుగా కాంగ్రెసు పార్టీకి, కేంద్రమంత్రి పదవికి రాజీనామా చేయాలంటూ సమైక్యవాదులు, టిడిపి ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌లు ఆయన ఇంటిని ముట్టడించారు. కావూరి ద్వారకా తిరుమల వెళ్లి ఇంటికి వస్తున్నారని తెలియడంతో సమైక్యవాదులు, ఎమ్మెల్యే ఆయన ఇంటికి చేరుకున్నారు. పోలీసులు అడ్డుకున్నా పెద్ద ఎత్తున అక్కడకు తరలి వచ్చారు.
సమైక్యవాదులను పోలీసులతో పాటు కావూరి అనుచరులు అడ్డుకునే ప్రయత్నాలు చేసినా ఫలించలేదు. పరస్పరం దాడులకు పాల్పడ్డారు. ఇరు వర్గాల మధ్య తోపులాట జరిగింది. అనంతరం కావూరి ఇంటిలోకి చొరబడి ఫర్నీచర్‌ను ధ్వంసం చేశారు. పోలీసులు కలుగజేసుకొని వారిని చెదరగొట్టారు. ఎమ్మెల్యే చింతమనేని కూడా కావూరి ఇంటిలోకి దూసుకెళ్లే ప్రయత్నాలు చేశారు. ఆయనను పోలీసులు అడ్డుకున్నారు. కావూరి సమైక్య ద్రోహి అంటూ సమైక్యవాదులు, టిడిపి కార్యకర్తలు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.












Click it and Unblock the Notifications