కోడ్: విజయారెడ్డి, టిడిపి ఎమ్మెల్యే చింతమనేని అరెస్ట్
పశ్చిమ గోదావరి/హైదరాబాద్:: జిల్లాలోని దెందులూరు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌ను బుధవారం పోలీసులు అరెస్ట్ చేశారు. ఎస్ఐపై దౌర్జన్యం చేసిన కేసులో ఆయనను పెదవేగి పోలీసులు అరెస్ట్ చేసి కోర్టులో హాజరపర్చారు.
స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా టిడిపి కార్యకర్తలు డబ్బులు పంచుతుండగా పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే ప్రభాకర్ పోలీస్ స్టేషన్‌లోకి వెళ్లి తన అనుచరుల్ని అక్రమంగా విడిచిపించుకునిపోయారు. ఈ సంఘటనపై పెదవేగి పోలీసులు చింతమనేనిపై కేసు నమోదు చేశారు.

దివంగత పిజెఆర్ తనయ విజయారెడ్డి అరెస్ట్
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఖైరతాబాద్ ఎమ్మెల్యే అభ్యర్థి, దివంగత నేత పి జనార్ధన్ రెడ్డి తనయ విజయారెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఎన్నికల కోడ్ ఉల్లంఘించారని విజయారెడ్డిపై ఆరోపణల నేపథ్యంలో పోలీసులు ఆమెను అరెస్ట్ చేశారు.
నాంపల్లి ఎంఐఎం ఎమ్మెల్యే అభ్యర్థి జాఫర్ హుస్సేన్‌ను కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. అనుమతి లేకుండా డిజె పెట్టారనే ఆరోపణలపై ఆయనను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.












Click it and Unblock the Notifications