జనసేన నేతలను ప్రచారానికి రావద్దన్న టీడీపీ అభ్యర్ధి
దెందులూరు మాజీ ఎమ్మెల్యే, టీడీపీ అభ్యర్థి చింతమనేని ప్రభాకర్ మరోసారి వార్తల్లో నిలిచారు. జనసేన పార్టీ నేతలను ఉద్దేశించి చింతమనేని ప్రభాకర్ చేసిన కామెంట్స్ కూటమిలో కాకరేపుతున్నాయి. పొత్తులో భాగంగా దెందులూరు నియోజకవర్గం నుంచి మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ టీడీపీ తరుఫున పోటీ చేస్తున్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా కూటమిలో విభేదాలు బయటపడ్డాయి. జనసేనకు పార్టీకు చెందిన నేతలు ఇద్దరు అందరి ముందే ఒకరిపై మరొకరు విమర్శలకు దిగారు.
దీనిపై అసహనం వ్యక్తం చేసిన చింతమనేని జనసేన నాయకుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనపై చింతమనేని మాట్లాడుతూ.. మీకు ఇష్టం అయితే మాతో ప్రచారం చేయండి. మీరు మీరు గొడవపడే కింద అయితే మీ ఇద్దరు ప్రచారానికి రావాల్సిన అవసరం లేదని... ఈ విధంగా మాతో పని చేయక్కర్లేదని చింతమనేని వ్యాఖ్యానించారు. చింతమనేని చేసిన వ్యాఖ్యలపైన జనసేన నాయకురాలు వెంకట లక్ష్మీ అభ్యంతరం వ్యక్తం చేశారు. మీరే వీళ్లని ఇక్కడకు తీసుకువచ్చారంటూ చింతమనేని తీరుపై వెంకట లక్ష్మీ అసహనం వ్యక్తం చేశారు.

నేను తీసుకురావడానికి వాళ్లు నా చుట్టమా అంటూ చింతమనేని ఎదురు ప్రశ్నించారు. ఏదైనా ఉంటే మనం తరువాత మాట్లాడుకుందామని ఆయన తెలిపారు. చంద్రబాబు, పవన్ కల్యాణ్ మాట ప్రకారం మనం కలిసి పని చేయాలి. మనలో మనం ఇలా గొడవ పడితే బయటవాళ్లకు చులకన అవుతామని చింతమనేని వ్యాఖ్యానించారు. మీ పార్టీలో ఏదైనా సమస్య ఉంటే జనసేన జిల్లా అధ్యక్షుడు దగ్గర తేల్చుకోవాలని చింతమనేని హితవు పలికారు. మీరు మీరు గొడవపడే లెక్కన అయితే నా ప్రచారానికి మీరు రావద్దంటూ చింతమనేని తేల్చి చెప్పారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.చింతమనేని జనసేన నాయకులపై చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఏపీ రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారాయి.












Click it and Unblock the Notifications