ఏపీలో మరో కొత్త రెవెన్యూ డివిజన్ ఏర్పాటు: 4 మండలాలతో చింతూరు
విశాఖపట్నం: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరో కొత్త రెవెన్యూ డివిజన్ ఏర్పడింది. అల్లూరి సీతారామరాజు జిల్లాలో కొత్తగా చింతూరు రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేస్తూ తాజాగా ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఏటిపాక, చింతూరు, కూనవరం, వర రామచంద్రపురం మండలాలతో కలిపి చింతూరు రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేశారు.
ఇటీవల ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వరద బాధితులను పరామర్శించేందుకు చింతూరు వెళ్లారు. ఈ సందర్భంలోనే స్థానికంగా డివిజన్ ఏర్పాటు ఆవశ్యకతను అక్కడి ప్రజలు ముఖ్యమంత్రికి తెలియజేశారు.
ఈ నేపథ్యంలోనే స్పందించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చింతూరులో రెవెన్యూ డివిజన్ కేంద్రం ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. తాజాగా ఆ హామీని నెరవేరుస్తూ కొత్త రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో స్థానిక ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. జగన్ సర్కారుకు ధన్యవాదాలు చెబుతున్నారు.

రంపచోడవరంలోని నాలుగు మండలాలతో కలిపి చింతూరు రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేశారు. ఏటిపాక, చింతూరు, కూనవరం, వర రామచంద్రాపురం మండాలలతో చింతూరును రెవెన్యూ డివిజన్ గా ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
అల్లూరి సీతారామరాజు జిల్లాలో కొత్తగా ఏర్పడిన చింతూరుతోపాటు పాడేరు, రంపచోడవరం రెవెన్యూ డివిజన్లు ఉన్నాయి. ఇప్పటికే రాష్ట్రంలో కొత్త జిల్లాలు ఏర్పడటంతో మొత్తం జిల్లాల సంఖ్య 26కు పెరిగింది. ఏపీకి పరిపాలన రాజధాని కాబోతున్న విశాఖపట్నం రాష్ట్రంలోనే అతి చిన్న జిల్లా కాగా, ప్రకాశం జిల్లా అతిపెద్ద జిల్లాగా మారింది.












Click it and Unblock the Notifications