చిరంజీవి జనసేనలోకి..!? ఎప్పుడూ నా విజయమే కోరుకుంటారు: పవన్ కళ్యాణ్ ఆసక్తికర వ్యాఖ్యలు

హైదరాబాద్/అమరావతి: ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మెగాస్టార్ చిరంజీవి రాజకీయాల్లోకి తిరిగి వస్తారనేది హాట్ టాపిక్‌గా మారింది. ప్రస్తుతం సినిమాల్లో బిజీగా ఉన్న చిరంజీవి.. ఎన్నికల నాటికి తన తమ్ముడు, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్‌కు మద్దతుగా వస్తారనే చర్చ జరుగుతోంది. ఇప్పటికే జనసేన, బీజేపీ నేతలు దీనిపై ప్రకటనలు చేస్తుండగా.. తాజాగా, పవన్ కళ్యాణ్ కూడా స్పందించారు.

నేను ఒక కులానికి చెందినవాడిని కాదు..

నేను ఒక కులానికి చెందినవాడిని కాదు..

మంగళగిరి జనసేన కార్యాలయంలో పవన్ కళ్యాన్ కాపు సంక్షేమ సేన సమావేశంలో పాల్గొని మాట్లాడారు. కులాలను ఓటు బ్యాంకుగా పరిగణించే కొద్దీ ఆయా వర్గాలకు శాసించే పరిస్థితి రాదని అన్నారు. రాష్ట్ర జనాభాలో 27 శాతం ఉన్న కాపుల్ని ఓటు బ్యాంకుగా చూడటాన్ని రాజకీయ పార్టీలు మానుకోవాలని స్పష్టం చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. తుని ఘటనలో కాపులకు సంఘీభావం తెలిపేందుకు వచ్చినవారిపై పెట్టిన కేసులను ఎత్తివేయాలని పవన్ కళ్యాణ్ డిమాండ్ చేశారు. తాను ఓ కులానికి చెందిన ప్రతినిధిని కాదని, అందరివాడినని అన్నారు. ఈ విషయాన్ని పదే పదే చెబుతున్నానన్నారు. ఉద్ధానం కిడ్నీ, అమరావతిలో దళితుల సమస్యలపై పోరాడిన విషయాన్ని పవన్ ఈ సందర్భంగా గుర్తు చేశారు.

కులాల కార్పొరేషన్లు రాజకీయ తాయిలాలే..

కులాల కార్పొరేషన్లు రాజకీయ తాయిలాలే..

ప్రభుత్వం ఏర్పాటు చేసిన కులాల కార్పొరేషన్లు ఆయా వర్గాలకు తాయిలాలేనని పవన్ కళ్యాణ్ అన్నారు. ఆయా వర్గాల నేతల రాజకీయ సాధికారిత వైపు చూడకుండా చేసే పన్నాగమే ఈ కార్పొరేషన్ల ఏర్పాటని వ్యాఖ్యానించారు. చిరంజీవిని ఉద్దేశిస్తూ ఇటీవల జనసేన నేత నాదెండ్ల మనోహర్ చేసిన నైతిక మద్దతు విషయాన్ని ఈ సందర్భంగా పలువురు మీడియా ప్రతినిధులు పవన్ కళ్యాణ్ వద్ద ప్రస్తావించారు.

చిరంజీవి నా విజయాన్నే కోరుకుంటారన్న పవన్ కళ్యాణ్

చిరంజీవి నా విజయాన్నే కోరుకుంటారన్న పవన్ కళ్యాణ్

చిరంజీవి ఎప్పుడూ తన మేలుకోరే చెబుతారు. దాన్ని అలాగే చూడాలి. తమ్ముడిగా నేను విజయం సాధించాలని ఆయన కోరుకుంటారు. మనస్ఫూర్తిగా ఆయన నా విజయాన్ని ఆకాంక్షించే వ్యక్తి అని పవన్ కళ్యాణ్ చెప్పారు. చిరంజీవి నైతిక మద్దతు ఎప్పుడూ నాకు ఉంటుందని పవన్ కళ్యాణ్ తెలిపారు.

చిరంజీవి జనసేనలోకి వస్తారా..? అనేది ఇప్పుడే చెప్పలేను

చిరంజీవి జనసేనలోకి వస్తారా..? అనేది ఇప్పుడే చెప్పలేను

చిరంజీవి అందరి మంచి కోరుకుంటారన్నారు. అయితే, చిరంజీవి జనసేన పార్టీలోకి వస్తారా? అనేది ఇప్పుడే చెప్పలేనని అన్నారు. ప్రజారాజ్యం పార్టీ వ్యవస్థాపకుల్లో తాను కూడా ఒకరినని చెప్పారు. చిరంజీవి తన మేలు కోరుకునే వ్యక్తి, అందులో రెండో మాట లేదని పవన్ అన్నారు. చిరంజీవి రాజకీయ అభిప్రాయాన్ని గౌరవిస్తానని, ఆయన నైతిక మద్దతు తనకు ఉంటుందన్నారు. చిరంజీవి జనసేనలో చేరిక అనేది పరిస్థితులను బట్టి ఉంటుందని పవన్ కళ్యాణ్ చెప్పారు. పార్టీలో చేరడం అనేది చిరంజీవి అభీష్టం మేరకు ఉంటుందన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+