"నీకు ధైర్యాన్ని పంపిస్తున్నా.. త్వరగా కోలుకుంటావ్.." సమంతకు వెల్లువలా పరామర్శలు

మయోసైటిస్ అనే అరుదైన వ్యాధితో బాధపడుతున్నట్లు ప్రముఖ కథానాయిక సమంత తెలపడం చిత్రపరిశ్రమను షాక్ కు గురిచేసింది. చికిత్స తీసుకుంటున్న చిత్రాన్ని కూడా ఆమె పోస్ట్ చేశారు. మన శరీరంలో ఉన్న రోగ నిరోధక వ్యవస్థ తిరిగి దాడిచేసే సమయంలో ఈ వ్యాధి సోకుతుంటుంది. ప్రత్యేకమైన చికిత్స తీసుకోవడంద్వారా ఇది తగ్గుతుంది. ఈ సందర్భంగా పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు అందరూ ట్విటర్ వేదికగా సమంత త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నారు. ఆమెలో ఆత్మవిశ్వాసాన్ని నింపేలా, ఆత్మస్థైర్యాన్ని కల్పించేలా పోస్టులు పెడుతున్నారు.

మనోబలం కలిగిన అద్భుత అమ్మాయివి నువ్వు..

మెగాస్టార్ చిరంజీవి సమంతనుద్దేశించి ట్వీట్ చేశారు. సామ్‌ త్వరగా కోలుకోవాలని చిరు కోరుకున్నారు. ''డియర్‌ సామ్‌.. కాలానుగుణంగా మన జీవితాల్లో ఎన్నో సవాళ్లు ఎదురవుతుంటాయి. వాటివల్ల మనకెంతటి శక్తి సామర్థ్యాలు ఉన్నాయో తెలుస్తుంది. మనోబలం కలిగిన అద్భుతమైన అమ్మాయివి నువ్వు. అతి త్వరలో ఈ సమస్యను అధిగమిస్తావనే నమ్మకం నాకు ఉంది'' అంటూ చిరంజీవి సమంతకు ధైర్యం చెప్పారు.

మీకు ధైర్యాన్ని పంపిస్తున్నా!

'త్వరగా కోలుకోవాలి.. మీకు ఆ ధైర్యాన్ని పంపుతున్నా' అంటూ జూనియర్ ఎన్టీఆర్ ట్వీట్ చేశారు. జనతా గ్యారేజ్‌, రామయ్య వస్తావయ్యా, బృందావనం, రభస లాంటి పలు చిత్రాల్లో సమంత జూనియర్ కు కథానాయికగా నటించింది. సోషల్ మీడియాలో సమంత నుంచి కొద్దిరోజులుగా పోస్టింగ్స్ లేకపోవడంతో ఆమె ఆరోగ్యానికి సంబంధించి రకరకాల వార్తలు చక్కర్లు కొట్టాయి. తాజాగా సమంత చేసిన ట్వీట్ తో అందరికీ స్పష్టత వచ్చింది. మయోసైటిస్ సోకినవారు కండరాల బలహీనతతోపాటు ఎక్కువసేపు కూర్చోలేరు. తాజాగా కథానాయకుడు నాని కూడా ట్వీట్ చేశారు. మీరు ఎప్పటిలాగే బలంగా తిరిగి పుంజుకోవడానికి ఎక్కువ సమయం తీసుకోరు అని రాశారు.

అండగా కథానాయికలు..

కథానాయికలు కైరా అద్వానీ, కాజల్ అగర్వాల్, రాహుల్ రవీంద్రన్ తదితరులు సమంత త్వరగా కోలుకోవాలంటూ ట్వీట్ చేశారు. సినీ పరిశ్రమ నుంచి సమంతకు మంచి మద్దతు లభిస్తోంది. సమంత ప్రధాన పాత్రలో నటిస్తున్న యశోదా చిత్రం నవంబరు 11వ తేదీన విడుల కానుంది. సరోగసీపై రూపొందించిన ఈ చిత్రంలో ఆమె టైటిల్‌ రోల్‌ పోషించారు. తెలుగు, తమిళంలో విడుదల కాబోతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+