బాబు కోసమా: ఏం జరుగుతోంది.. చిరంజీవి టూర్ X పవన్ కళ్యాణ్ ట్వీట్

విజయవాడ: కాపు రిజర్వేషన్ల కోసం మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం కిర్లంపూడిలోని తన ఇంట్లో నిరవధిక నిరాహార దీక్ష చేస్తున్నారు. ఆయన దీక్షకు కాపుల నుంచి పెద్ద ఎత్తున మద్దతు లభిస్తోంది. ముద్రగడ దీక్షకు సంఘీభావం తెలిపేందుకు సోమవారం కాంగ్రెస్ ఎంపీ చిరంజీవి వెళ్లనున్నారు.

మాజీ కేంద్రమంత్రి, దర్సకరత్న దాసరి నారాయణ రావు కూడా వెళ్లనున్నారు. మరోవైపు, ముద్రగడ దీక్షకు రోజు రోజున మద్దతు లభిస్తోంది. ఈ నేపథ్యంలో జనసేన పార్టీ అధ్యక్షులు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సామాజిక అనుసంధాన వేదికలో ప్రభుత్వానికి సూచన చేయడం గమనార్హం.

గత ఆదివారం నాడు తునిలో ఏర్పాటు చేసిన కాపు ఐక్య గర్జన ఉద్రిక్తతకు దారి తీసింది. రైలును కాల్చి వేయడం, పోలీస్ స్డేషన్‌ను తగులబెట్టడం జరిగింది. దీనిపై పవన్ కళ్యాణ్ సోమవారం నాడు స్పందిస్తారని ఆదివారం నాడు జనసేన పార్టీ ప్రకటన విడుదల చేసింది.

Chiranjeevi and Pawan Kalyan political war?

వెంటనే ఆ మరుసటి రోజ పవన్ కళ్యాణ్... సమావేశానికి ముందు పవన్ కళ్యాణ్ అన్నయ్య, కాంగ్రెస్ ఎంపీ చిరంజీవి ఏపీ సీఎం చంద్రబాబుకు ఘాటు లేఖ రాశారు. కాపులను న్యాయం చేయాలని సూచించారు.

ఇప్పుడేమో ముద్రగడ దీక్షకు సంఘీభావం తెలిపేందుకు చిరంజీవి సోమవారం వెళ్లనున్నారని వార్తలు వచ్చాయి. ఆ వెంటనే పవన్ కళ్యాణ్ ట్విట్టర్లో ప్రభుత్వానికి హితవు పలికారు. ఈ నేపథ్యంలో చిరు, పవన్ కళ్యాణ్ మధ్య రాజకీయ వైరం కొనసాగుతోందా అనే చర్చ సాగుతోంది.

ముద్రగడ మూడు రోజులుగా దీక్ష చేస్తున్నారు. ఇరువురు సోదరులు కూడా ఆదివారమే స్పందించారు. గత వారం తుని ఘటన పైన కూడా పవన్ కళ్యాణ్ ప్రెస్ మీట్ ఉంటుందని ప్రకటన వెలువడిన తర్వాత చిరంజీవి.. చంద్రబాబుకు లేఖ రాశారు.

వీరిద్దరు మధ్య రాజకీయ విభేదాలు ఉన్నప్పటికీ కుటుంబ పరంగా, సినిమాల పరంగా మాత్రం అపూర్వ సోదరులు అంటున్నారు. ఇటీవల శ్రీజ పెళ్లి పైన వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. శ్రీజ పెళ్లి విషయమై పవన్ కళ్యాణ్.. చిరంజీవి కుటుంబంతో చర్చించారని వార్తలు వచ్చాయి. పవన్ కళ్యాణ్ ఇలా బయటకు రావడం చంద్రబాబు కోసమేనా అనే చర్చ సాగుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+