చిరంజీవి-రామ్ చరణ్ కాంబో... దర్శకుడు అతనే
చిరంజీవి, రామ్ చరణ్ కాంబినేషన్ లో ఆచార్య సినిమా వచ్చిన సంగతి తెలిసిందే. అది డిజాస్టర్ కావడంతో అభిమానులు ఎంతో నిరుత్సాహపడ్డారు. ఇద్దరు స్టార్ హీరోల కాల్షీట్లను కొరటాల శివ ఉపయోగించుకోలేకపోయాడంటూ విమర్శలు వచ్చాయి. అయితే తాజాగా ఫిల్మ్ నగర్ లో చక్కర్లు కొట్టడంతోపాటు సోషల్ మీడియాలో ఒక వార్త వైరల్ గా మారింది. చిరంజీవి-రామ్ చరణ్ కలిసి నటించబోతున్నారని.
చిరంజీవి, చరణ్ కాంబోలో మరో సినిమా తెరకెక్కబోతోంది. చరణ్ బుచ్చిబాబు కాంబినేషన్ లో ఒక సినిమా ఫిక్సయిన సంగతి తెలిసిందే. బుచ్చిబాబు నాలుగు సంవత్సరాలు కష్టపడి ఈ సినిమా స్క్రిప్ట్ ను సిద్ధం చేశారు. స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కబోతున్న ఈ సినిమాలో ఎమోషన్స్ కూడా అంతేస్థాయిలో ప్రాధాన్యత కలిగివుంటాయని తెలుస్తోంది. మెగాస్టార్ చిరంజీవి కీ రోల్ లో నటించబోతున్నారు. వీరిద్దరూ కలిసి నటిస్తే బాక్సాఫీస్ రికార్డులు షేక్ కావడం ఖాయమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

తండ్రీ కొడుకుల కాంబినేషన్ నెక్స్ట్ లెవెల్ కాంబినేషన్ అనే అభిప్రాయాన్ని నెటిజన్లు వ్యక్తం చేస్తున్నారు. ఈ సినిమాలో నటించే హీరోయిన్ ఎవరో తెలియాల్సి ఉంది. బాలీవుడ్ హీరోయిన్ ను ఎంపిక చేయవచ్చు అంటున్నారు. ఈ సినిమా పూర్తయిన తర్వాత రామ్ చరణ్ సుకుమార్ దర్శకత్వంలో నటించబోతున్నారు. ఈ సినిమాపై ఇప్పటినుంచే అంచనాలు రోజురోజుకు పెరుగుతున్నాయి.
చరణ్, బుచ్చిబాబు భవిష్యత్తు ప్రాజెక్ట్ తో పాన్ ఇండియా స్థాయిలో భారీ హిట్ ను సొంతం చేసుకోవాలని మెగా అభిమానులు కోరుకుంటున్నారు. ఈ సినిమాలో ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయని తెలుస్తోంది. చరణ్ పారితోషికం ప్రస్తుతం 100 కోట్ల రూపాయలకు సమీపంలో ఉంది.












Click it and Unblock the Notifications