5 తీర్మానాలు, భేటీలో చిరు: కర్నూలు రాజధాని కోసం..
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ కాంగ్రెసు పార్టీ నేతలు ఆదివారం ఇందిరా భవన్‌లో భేటీ అయి ఐదు తీర్మానాలు చేశారు. ఈ భేటీలో మాజీ కేంద్రమంత్రి చిరంజీవి, రాజ్యసభ సభ్యుడు కేవీపీ రామచంద్ర రావు, మాజీ మంత్రులు కన్నా లక్ష్మీనారాయణ, ఆనం రామనారాయణ రెడ్డి, బొత్స సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్‌లో భేషరతుగా వ్యవసాయ, డ్వాక్రా రుణాలు మాఫీ చేయాలని, విభజనకు సంబంధించిన చట్టాలను ఎన్డీయే ప్రభుత్వం అమలు చేయాలని, జాతీయ ఉపాధి హామీ పథకాన్ని కొనసాగించాలని, కొత్తగా పీసీసీ, డీసీసీ మండల కమిటీలను ఏర్పాటు చేయాలని వారు నిర్ణయం తీసుకున్నారు.

కర్నూలు కోసం రాజధాని సాధన సమితి
కర్నూలులోనే రాజధానిని ఏర్పాటు చేయాలని రాయలసీమ ప్రాంత వాసులందరూ శివరామకృష్ణన్ కమిటీని కోరాలని కర్నూలు రాజధాని సాధన సమితి సభ్యులు ఆదివారం అన్నారు.
ఆంధ్రప్రదేశ్ కొత్త రాజధాని కోసం నియమించిన శివరామకృష్ణన్ కమిటీ కర్నూలులో పర్యటించనున్న నేపథ్యంలో రాయలసీమవాసులందరూ రాజధానిని కర్నూలులో ఏర్పాటు చేయాలని కోరుతామన్నారు. జిల్లాలోని అన్ని సంఘాల నాయకులు, ప్రజాప్రతినిధులు ర్యాలీగా వచ్చి శివరామకృష్ణన్ కమిటీకి విజ్ఞపాన పత్రాలు ఇవ్వాలన్నారు.












Click it and Unblock the Notifications