చిరంజీవి 'భోళాశంకర్' ఫైనల్ కలెక్షన్స్
చిరంజీవి కెరీర్ లోనే మాయని మచ్చగా మిగిలింది భోళాశంకర్ చిత్రం. ఏకే ఎంటర్ టైన్మెంట్ బ్యానర్ పై అనిల్ సుంకర నిర్మించిన ఈ చిత్రారాజానికి దర్శకుడు మెహర్ రమేష్. మొదటినుంచి ఈ సినిమాలపై పెద్దగా అంచనాలు లేనప్పటికీ దారుణంగా, డిజాస్టర్ గా మారుతుందని ఎవరూ ఊహించలేకపోయారు. ఈ సినిమాకు 6వ రోజుతో పాటు 7వ రోజు కూడా థియేటర్స్‌లో కనీసం మెయింట్ నెన్స్ ఖర్చు రాలేదు.
ఈ సినిమా నెగెటివ్ షేర్ రాబట్టింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో 6వ రోజు రూ.10 లక్షల షేర్ రాగా, 7వ రోజు రూ.6 లక్షలు వచ్చాయి. ఇన్ని సంవత్సరాల చిరంజీవి కెరీర్ లో ఈ రేంజ్ ఫలితం వస్తుందని ఎవరూ ఊహించలేకపోయారు. తమ్ముడులాంటివాడు కదా అని.. మంచి కెరీర్ ఇద్దామని మంచితనానికి పోయిన చిరంజీవిని రమేష్ అడ్డంగా ముంచేశాడంటూ అభిమానులు మండిపడుతున్నారు.

హిందీలో కూడా భోళా శంకర్ పేరుతో ఆగస్ట్ 25న విడుదల చేస్తున్నట్టు ప్రకటించారుకానీ తర్వాత విరమించుకున్నారు. చిరంజీవికి జాకీ ష్రాఫ్ డబ్బింగ్ చెప్పారు. యూట్యూబ్ లో విడుదల చేస్తే కాస్తో కూస్తో డబ్బులన్నా నిర్మాతకు వచ్చేవి. తెలుగుతోపాటు అన్ని భాషల్లో త్వరలోనే ఓటీటీలో స్ట్రీమింగ్ కు రానుంది.
ఈ సినిమా థియేట్రికల్ రన్ ముగిసింది. ప్రపంచ వ్యాప్తంగా టోటల్ కలెక్షన్స్.. ఏపీ తెలంగాణలో రూ. 25.44 కోట్ల షేర్ (రూ. 38.50 కోట్ల గ్రాస్) వచ్చింది. పంచవ్యాప్తంగా రూ. 29.50 కోట్ల షేర్ రాగా.. 47.50కోట్ల గ్రాస్ వచ్చింది. బాక్సాఫీస్ దగ్గర రూ. 51 కోట్లకు పైగా నష్టాలను మిగిల్చింది. 36.5 శాతం రికవరీ సాధించి చిరు కెరీర్‌లో అత్యంత దారుణమైన బిగ్గెస్ట్ డిజాస్టర్‌గా నిలిచింది. బింబిసార దర్శకుడు వశిష్టతో ఓ సినిమా చేయనున్నారు. పంచభూతాల నేపథ్యంలో సోషియో ఫాంటసీ కథాంశంతో ఇది తెరకెక్కబోతోంది.












Click it and Unblock the Notifications