వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పార్టీ వద్దు: పవన్‌కు చిరు వర్గం మహిళా నేతలు

By Pratap
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌: పార్టీ పెట్టాలనే పవన్ కళ్యాణ్‌ను యోచనను విరమింపజేయడానికి కేంద్ర మంత్రి, ఆయన అన్నయ్య చిరంజీవి వర్గం మహిళా నేతలు రంగంలోకి దిగినట్లు తెలుస్తోంది. రాజకీయాల్లోకి రావద్దని, పార్టీ పెట్టవద్దని పవన్‌ కళ్యాణ్‌ను స్వయంగా కోరడానికి వారు సన్నాహాలు చేసుకుంటున్నారు. పవన్ కళ్యాణ్‌ను స్వయంగా కలిసి ఆ విషయం చెప్పాలని వారు ప్రయత్నాలు ప్రారంభించారు.

చిరంజీవి వర్గం మహిళా నేతలు రేపు (బుధవారం) పవన్ కళ్యాణ్ అపాయింట్‌మెంట్ కోరినట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించి వారు పవన్ కళ్యాణ్ సన్నిహితులను సంప్రదించినట్లు చెబుతున్నారు. ప్రస్తుత పరిస్థితిలో పార్టీ పెట్టవద్దని వారు కోరుతారని అంటున్నారు.

 Pawan

ఒక వేళ రాజకీయ పార్టీ స్థాపించాలని ఉంటే మరో ఐదేళ్లు ఆగాలని వారు పవన్ కళ్యాణ్‌కు నచ్చజెప్పాలని అనుకుంటున్నట్లు తెలుస్తోంది. పవన్ కళ్యాణ్ పార్టీ పెడితే చిరంజీవికి ఇబ్బంది తప్పదనే భావనతో వారు అందుకు సిద్ధపడినట్లు చెబుతున్నారు.

పవన్ కళ్యాణ్ ఈ నెల 14వ తేదీన రాజకీయ రంగ ప్రవేశాన్ని ప్రకటించడానికి అన్ని ఏర్పాట్లూ చేసుకున్నట్లు చెబుతున్నారు. హైటెక్స్‌లో ఆ రోజు సాయంత్రం మీడియా సమావేశం ఏర్పాటు చేసి తాను రాజకీయ పార్టీ పెడుతున్న విషయాన్ని, తాను పార్టీ పెట్టాలని నిర్ణయం తీసుకోవడంలోని ఉద్దేశ్యాన్ని వెల్లడిస్తారని చెబుతున్నారు.

English summary
It is said that Chiranjeevi's camp women leaders are planning to meet Pawan Kalyan to urge not to float political party.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X