మాటల్లో చెప్పలేను, సెల్యూట్ - చిరంజీవి ఎమోషనల్..!!
మెగాస్టార్ చిరంజీవి చేసిన ట్వీట్ ఇప్పుడు వైరల్ అవుతోంది. ఈ రోజు చిరంజీవి తన జీవితంలో ఎంతో ముఖ్యమైన రోజుగా పేర్కొన్నారు. సీనీ రంగంలో ఉంటూ సేవ కోసం ప్రారంభించిన చిరంజీవి ఛారిటబుల్ ట్రస్టు ఈ రోజుతో 25 ఏళ్ల ప్రయాణం పూర్తి చేసుకుంది. ఎంతో ప్రాముఖ్యత ఉన్న ఈ రోజునే చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ ప్రారంభమైంది. 25 సంవత్సరాల ప్రయాణం ఎంతో అద్భుతంగా సాగిందని చిరంజీవి పేర్కొన్నారు. ఉద్వేగానికి లోనయ్యారు.
On this important day for our country,
— Chiranjeevi Konidela (@KChiruTweets) October 2, 2023
I also fondly reflect on Chiranjeevi Charitable Trust( CCT)’s humble beginnings and its amazing journey of 25 years.
Over 10 lakh blood 🩸 units collected and distributed to the needy and
eye 👁️ sight restored to over 10 thousand people… pic.twitter.com/UeVzCB58cp
చిరంజీవి ఛారిటబుల్ ట్రస్ట్‌ను ప్రారంభించి 25 వసంతాలు పూర్తయింది. 1998 అక్టోబర్ 2న చిరంజీవి ఛారిటబుల్ ట్రస్ట్‌ను ప్రారంభించారు. ఈ సమయంలో చిరంజీవి తన అనుభవాలను పంచుకున్నారు. అందులో..''దేశ ప్రజలకు ఈరోజు ఎంతో ముఖ్యమైనది. నేను చిరంజీవి ఛారిటబుల్ ట్రస్ట్ ప్రారంభించిన నాటి క్షణాలను గుర్తు చేసుకుంటున్నా. పాతిక వసంతాల అద్భుతమైన జర్నీ ఇది. ఇప్పటివరకూ 10 లక్షల బ్లడ్ యూనిట్లను సేకకరించి అవసరమైన వారికి అందజేశాం. 10 వేల మందికి కంటి చూపునిచ్చాం. కరోనా సమయంలో వేల మందికి సాయం అందించామని చిరంజీవి గుర్తు చేసారు.













Click it and Unblock the Notifications