మొయిలీకి చిరంజీవి ప్రచారం: సీమాంధ్ర జాబితా రెడీ

చిరంజీవిని చూసేందుకు పెద్దఎత్తున అభిమానులు తరలి వస్తారని భావించి అదనపు పోలీసు బలగాలను కోరినట్లు తెలిపారు. చిక్కబళ్లాపుర జిల్లాలో తెలుగువారు అధికంగా ఉన్నందున ఆయన అక్కడ పర్యటించనున్నారు.
అధిష్టానం పెద్దలతో సమావేశం తర్వాత సీమాంధ్ర కాంగ్రెస్ అభ్యర్థుల తొలి జాబితాను విడుదల చేయడానికి కాంగ్రెస్ నేతలు సన్నాహాలు చేసుకున్నారు. గురువారం చిరంజీవి నివాసంలో సమావేశమైన రఘువీరారెడ్డి, బొత్స సత్యనారాయణ, ఆనం రామనారాయణరెడ్డిలు సీమాంధ్ర అభ్యర్థుల జాబితాపై కసరత్తులు పూర్తి చేశారు. ఈ జాబితాను అధిష్టానం వద్దకు తీసుకువెళ్ళనున్నారు.
సీమాంధ్రకు సంబంధించి ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థుల ఎంపిక కసరత్తు దాదాపు పూర్తయిందని, ఇంకా 20, 30 స్థానాలకు సంబంధించి పరిశీలించాల్సి ఉందని, తొలి దశలో వంద మంది అభ్యర్థుల జబితాను విడుదల చేస్తారని తెలియవచ్చింది. ఎన్నికల ప్రణాళికకు సంబంధించి కూడా గురువారంనాడు చర్చలు జరినట్లుగా సమాచారం.
అధిష్టానంతో చర్చించిన అనంతరం ఒకటి, రెండు రోజుల్లో మేనిఫెస్లోను విడుదల చేసే అవకాశమున్నట్లు తెలియవచ్చింది. ఈనెల 17న సీమాంధ్రలో నామినేషన్ల ప్రక్రియ పూర్తి కావాల్సి ఉన్న నేపథ్యంలో అభ్యర్థుల ఎంపికపై నేతలు చర్చలు జరుపుతున్నారు.












Click it and Unblock the Notifications