భర్తతో కలిసి బెజవాడకు శ్రీజ, చంద్రబాబును కలిసిన బాలీవుడ్ హీరో
విజయవాడ: ఇటీవలే వివాహమైన చిరంజీవి చిన్న కూతురు శ్రీజ తన భర్త కల్యాణ్‌తో కలసి మంగళవారం విజయవాడలో పర్యటించారు. ఉదయం బెజవాడ కనకదుర్గ గుడికి వచ్చారు. నూతన దంపతులకు ఆలయ అధికారులు స్వాగతం పలికారు.
వారికి దగ్గరుండి దర్శన ఏర్పాట్లు చేశారు. కనకదుర్గమ్మకు ప్రత్యేక పూజలు చేసిన అనంతరం, వారికి ప్రసాదం అందించారు. గులాబీ రంగు చీరలో శ్రీజ, కుర్తా ప్యాంటులో కల్యాణ్ గుడిలో కాసేపు అటూ ఇటూ తిరిగారు. వీరిద్దరినీ చూడటానికి ఆ సమయంలో అక్కడున్న భక్తులు ఆసక్తి కనబర్చారు.

మెగాస్టార్ చిరంజీవి చిన్నకూతురు శ్రీజ వివాహం కొద్ది రోజుల క్రితం బెంగుళూరులో జరిగిన సంగతి తెలిసిందే. జ్యువెలరీ డిజైనర్ కల్యాణ్‌తో శ్రీజ వివాహం జరిగింది. పూర్తి ప్రైవేట్ కార్యక్రమంగా జరిగిన దీనికి కుటుంబ సభ్యులు, కొందరు ప్రముఖులు, బంధువులు మాత్రమే హాజరయ్యారు.
అనంతరం ఈ పెళ్లి వేడుకకు సంబంధించిన వీడియో కూడా విడుదలైంది. ఈ వీడియోలో చిరంజీవి అల్లుడికి కాళ్లు కడిగి కన్యాదానం చేయడం, మూడు ముళ్లు, తలంబ్రాలు, జీలకర్రబెల్లం ఘట్టం లాంటివి ఆకట్టుకుంటున్నాయి. ఆ తర్వాత వెడ్డింగ్ రిసెప్షన్ కూడా జరిగింది.
బాబును కలిసిన అజయ్ దేవగణ్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును ప్రముఖ బాలీవుడ్ నటుడు అజయ్ దేవగణ్ మంగళవారం భేటీ అయ్యారు. విజయవాడలోని సీఎం కార్యాలయంలో చంద్రబాబును మర్యాదపూర్వకంగా కలిశారు. పలు విషయాలపై ఇరువురి మధ్య చర్చ జరిగినట్లుగా తెలుస్తోంది.
-
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..!












Click it and Unblock the Notifications