జగన్ మద్దతుగా ఉన్నారు..సినీ ప్రముఖులతో చిరు : వారికి ఆహ్వానం లేదా-అజెండా ఫిక్స్..!!
ఏపీలో సీనీ పరిశ్రమ సమస్యల పైన ఏపీ ముఖ్యమంత్రి నుంచి చిరంజీవికి ఆహ్వానం అందింది. ముఖ్యమంత్రితో చర్చించి సమస్యల పరిష్కారం కోసం రావాలంటూ మంత్రి పేర్ని నాని ఫోన్ చేసి చిరంజీవిని ఆహ్వానించారు. దీంతో..వెంటనే చిరంజీవి స్పందించారు. స్వతంత్ర్య దినోత్సవం నాడు సాయంత్రం టాలీవుడ్ ప్రముఖులతో చిరంజీవి భేటీ అయ్యారు. చిరంజీవి వారిని తన ఇంటికి ఆహ్వానించారు. దాదాపుగా మూడు గంటల పాటు సమావేశమయ్యరు. పరిశ్రమ ఎదుర్కొంటున్న సమస్యల పైన చర్చించారు.

సినీ ప్రముఖులతో చిరంజీవి భేటీ..
తనకు ఏపీ ప్రభుత్వం నుంచి వచ్చిన ఆహ్వానం గురించి చిరంజీవి సినీ ప్రముఖలకు వివరించారు. ప్రభుత్వం నుంచి కావాల్సిన సాయం పైన వారి అభిప్రాయాలు సేకరించారు. ఈ సమావేశంలో నాగార్జున, అల్లు అరవింద్, సురేష్ బాబు, దిల్ రాజు, సీ కళ్యాణ్, నారాయణ మూర్తి తో సహా ఇతర ప్రముఖులు హాజరయ్యారు. ప్రధానంగా బీ, సీ సెంటర్లలో టిక్కెట్ ధరల పెంపు అంశం పైన ప్రభుత్వంతో చర్చించాలని నిర్ణయానికి వచ్చారు. దీంతో పాటుగా సినీ- ధియేటర్ కార్మికుల సమస్యల పైన ఒక వినతి పత్రం సిద్దం చేయాలని నిర్ణయించారు.

ప్రభుత్వం నుంచి కావాల్సిన సాయం పై..
థియేటర్ల విద్యుత్ టారిఫ్ గురించి ప్రభుత్వం నుంచి మినహాయింపులు పొందే అంశాన్ని ప్రస్తావించాలని చిరంజీవికి సూచించారు. అదే విధంగా సినీ ఇండస్ట్రీ కార్మికుల సమస్యల ను వివరించి .. వారికి ప్రభుత్వం నుంచి అసరా లభించేలా ఒప్పించాలని సమావేశంలో పాల్గొన్న ప్రముఖులు అభిప్రాయ పడ్డారు. అయితే, ఈ సమావేశంలో గతంలో ముఖ్యమంత్రి జగన్ తో మీటింగ్ వెళ్లిన వారు హాజరయ్యారు. కానీ, కేసీఆర్ - జగన్ వద్ద సమావేశాలకు వెళ్లే సమయంలో బాలయ్య..మోహన్ బాబు లాంటి వారిని ఆహ్వానించకపోవటం పైన వివాదం చోటు చేసుకుంది.

వారికి ఈ సారి ఆహ్వానం లేదా...
ఈ సారి చిరంజీవి ముందుగానే సినీ పెద్దలతో సమావేశమైనా..బాలయ్య, మోహన్‌బాబు ఈ మీటింగ్ లో కనిపించలేదు. మరి..వారు సీఎం జగన్ తో సమావేశానికి హాజరవుతారా...వారిని చిరంజీవి అండ్ టీం ఆహ్వానిస్తుందా లేదా అనేది ఇప్పుడు మరో హాట్ టాపిక్. అయితే, సీఎం జగన్ స్వయంగా ఆహ్వానించటంతో ..పరిశ్రమకు సంబంధించిన అన్ని సమస్యలు ప్రస్తావించాలని సమావేశంలో తీర్మానించారు. గతంలో సీఎం జగన్ తో సమావేశమైన సమయంలో ప్రస్తావించిన అంశాలు..వాటికి పరిష్కారంగా ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల పైన ఈ భేటీలో చర్చించారు.

విశాఖ కేంద్రంగా టాలీవుడ్ విస్తరణ..
విశాఖలో సినీ పరిశ్రమ విస్తరణ పైన ఉన్న అవకాశాలు..ప్రభుత్వం నుంచి కావాల్సిన మద్దతు పైనా మరో కీలక అంశంగా నిర్మాతలు-దర్శకుల నుంచి చిరంజీవి అభిప్రాయలు సేకరించి ముఖ్యమంత్రికి నివేదించేందుకు సిద్దమైనట్లు తెలుస్తోంది. గతంలో విశాఖలో రామానాయుడు స్టూడియో స్థలాలను ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుందనే వార్తలు వచ్చాయి. వీటిని సురేష్ బాబు ఖండించారు. అదే విధంగా ప్రభుత్వం ప్రోత్సాహకాలు ఇస్తే విశాఖ కేంద్రంగా మరింగా సినీ పరిశ్రమ విస్తరించేందుకు ఉన్న అవకాశాలను ముఖ్యమంత్రికి నివేదించాలని నిర్ణయం తీసుకున్నారు.
Recommended Video

ఈ వారంలోనే భేటీ..
ఈ వారంలోనే ముఖ్యమంత్రి జగన్ -జగన్ భేటీ ఉండే అవకాశం కనిపిస్తోంది. ఈ నెల 22న చిరంజీవి జన్మదినం..అదే సమయంలో కొత్తగా రీమేక్ సినిమా షూటింగ్ ప్రారంభం కావటంతో..ముఖ్యమంత్రికి అవకాశం ఉంటే ఈ నెల 18 లేదా 19వ తేదీల్లో సమావేశం జరపాలని చిరంజీవి కోరినట్లుగా తెలుస్తోంది. సీఎంఓ నుంచి ఈ మేరకు అప్పాయింట్ మెంట్ ఖరారు అయితే, చిరంజీవి అండ్ టీం సిద్దంగా ఉంది. తమకు దాదాపుగా రెండు గంటల సమయం ఇవ్వాలని కోరినట్లుగా తెలుస్తోంది. సినీ పరిశ్రమలో చిరంజీవికి ఏపీ ప్రభుత్వం ప్రయార్టీ ఇవ్వటం.. ఆయన్ను సినీ పెద్దగా ఆహ్వానించటం పైన భిన్నాభిప్రాయాలు ఉన్నా.. .సినీ పరిశ్రమ సమస్యల పరిష్కారానికి దీనిని వినియోగించుకోవాలని సీని పెద్దలు భావిస్తున్నారు.












Click it and Unblock the Notifications