మీకు రాజకీయాలు 1% కూడా కరెక్ట్ కాదు అన్నయ్యా- చిరంజీవికి ముఖం మీదే చెప్పేసిన దర్శకుడు

అమరావతి: రాష్ట్రంలో సంక్రాంతి సందడి మొదలవుతోంది. ఈ నెల 12వ తేదీ నుంచి సంక్రాంతి సెలవులు ప్రారంభం కానున్నాయి. 18వ తేదీ వరకు కొనసాగనున్నాయి. అదే రోజు నుంచి భారీ బడ్జెట్ సినిమాలు ప్రేక్షకుల ముందుకు రాబోతోన్నాయి. కోట్లాదిమంది అభిమానులు ఎప్పుడెప్పుడా అంటూ ఎదురు చూస్తోన్న మాస్ మూవీస్ ఈ రెండు కూడా. నందమూరి బాలకృష్ణ నటించిన వీరసింహా రెడ్డి, మెగాస్టార్ చిరంజీవి వాల్తేర్ వీరయ్య.. ఒక్కరోజు తేడాతో విడుదల కానున్నాయి.

12న వీరసింహా రెడ్డి..

12న వీరసింహా రెడ్డి..

ఈ నెల 12వ తేదీన వీర సింహా రెడ్డి ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. శృతిహాసన్ హీరోయిన్. గోపీచంద్ మలినేని దర్శకుడు. ఇటీవలే ఒంగోలులో ఈ సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్ నిర్వహించింది చిత్రం యూనిట్. అదే సమయంలో విడుదల చేసిన ట్రైలర్ అదరగొడుతోంది. బాలకృష్ణ మాస్ లుక్ లో కనిపించారీ మూవీలో.

13న వాల్తేర్ వీరయ్య..

13న వాల్తేర్ వీరయ్య..

మెగాస్టార్ చిరంజీవి నటించిన వాల్తేర్ వీరయ్యకు కేఎస్ రవీంద్ర దర్శకుడు. రవితేజ ప్రత్యేక పాత్రను పోషించారు. శనివారమే ఈ మూవీ ట్రైలర్ కూడా రిలీజ్ అయింది. విశాఖపట్నంలో ప్రీ రిలీజ్ ఫంక్షన్ జరుపుకొంది. ఈ రెండూ కూడా భారీ బడ్జెట్ సినిమాలే. అదే స్థాయిలో ప్రేక్షకుల అంచనాలు కూడా ఉన్నాయి. అఖండ తరువాత బాలకృష్ణ నటించిన మూవీ వీరసింహారెడ్డి. అఖండ సూపర్ హిట్ గా నిలిచింది. ఆచార్య తరువాత చిరంజీవి నటించిన లేటెస్ట్ మూవీ వాల్తేర్ వీరయ్య. ఆచార్య మూవీ గ్రేట్ డిజాస్టర్.

పక్కా మాస్ రోల్..

పక్కా మాస్ రోల్..

ఆచార్య డిజాస్టర్ తరువాత వస్తోన్న మూవీ కావడం, చిరంజీవి గల్ల లుంగీ, పూలచొక్కాతో పక్కా మాస్ క్యారెక్టర్ లో కనిపిస్తోండటంతో వాల్తేర్ వీరయ్యపై హైప్ క్రియేట్ అయింది. దీనికి అనుగుణంగా ట్రైలర్ టాక్ అదరగొట్టింది. పూల చొక్కా, గళ్ల లుంగీలో మెగాస్టార్ ప్యూర్ మాస్ లుక్స్ లో కనిపించారు. ఆయనకు తోడుగా మాస్ మహారాజా రవితేజ కూడా తెరను పంచుకోవడం సినిమాపై మరింత హైప్ క్రియేట్ అయింది.

దర్శకుడు కీలక వ్యాఖ్యలు..

దర్శకుడు కీలక వ్యాఖ్యలు..

వాల్తేర్ వీరయ్య ప్రీ రిలీజ్ ఫంక్షన్ లో దర్శకుడు కేఎస్ రవీంద్ర చేసిన వ్యాఖ్యలు సంచలనం రేపుతున్నాయి. మెగాస్టార్ చిరంజీవికి రాజకీయాలు ఒక్కశాతం కూడా సరిపోవని స్పష్టం చేశారాయన. మీకు రాజకీయాలు వన్ పర్సెంట్ కూడా కరెక్ట్ కాదు అన్నయ్యా.. అంటూ చిరంజీవికి ముఖం మీదే తేల్చి చెప్పారు కేఎస్ రవీంద్ర.

దేవుడొక తమ్ముడిని ఇచ్చాడు..

దేవుడొక తమ్ముడిని ఇచ్చాడు..

చిరంజీవికి దేవుడు ఒక తమ్ముడిని ఇచ్చాడని, రాజకీయాలన్నీ అతను చూసుకుంటాడని పవన్ కల్యాణ్ ను ఉద్దేశించి చెప్పారు. రాజకీయాలకు అతను సమాధానం చెబుతాడు.. గట్టిగా నిలబడతాడు.. మీలో నుంచి వచ్చిన మంచితనం, ఆవేశం కలిసిన అతనే పవర్ స్టార్ అంటూ పవన్ కల్యాణ్ ను ప్రశంసించారు కేఎస్ రవీంద్ర. మాటకు మాట, కత్తికి కత్తి, పొగరుకు పొగరు పవర్ స్టార్.. అంటూ ఆకాశానికెత్తేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+