అక్కినేని మృతిపై చిరు, జూఎన్టీఆర్: నన్నపనేని ఉద్వేగం
హైదరాబాద్: అక్కినేని నాగేశ్వర రావు మృతి పట్ల హీరో జూనియర్ ఎన్టీఆర్ బుధవారం తన సంతాపం తెలిపారు. ఎన్టీఆర్, ఎఎన్నార్‌ల కీర్తి ఆచంద్రతారార్కం అన్నారు. వారిద్దరు పరిశ్రమకు రెండు కళ్లు అన్నారు. తెలుగు చలన చిత్ర పరిశ్రమకు అక్కినేని సేవలు మరువలేనివి చిరంజీవి అన్నారు. మా అమ్మకు అక్కినేని అంటే అభిమానమని చెప్పారు. అక్కినేని మృతి చెందిన విషయం తెలిసిందే.
రోశయ్య సంతాపం
అక్కినేని మృతితో ఓ శకం ముగిసిందని, ఆయన మరణం చాలా బాధాకరం అని తమిళనాడు గవర్నర్ కొణిజేటి రోశయ్య అన్నారు. సుదీర్ఘ నటనా ప్రస్థానంలో ఓ శకం ముగిసిందన్నారు. అక్కినేని మృతి పట్ల చలన చిత్ర పరిశ్రమకు తీరని లోటు అని చెప్పారు.

చిరస్మరణీయ సేవలు: చంద్రబాబు
అక్కినేని చిత్ర పరిశ్రమకు చిరస్మరణీయ సేవలు అందించారని టిడిపి అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు అన్నారు. అక్కినేని మృతితో చిత్ర పరిశ్రమ శోక సముద్రంలో మునిగిందని నందమూరి హరికృష్ణ అన్నారు.
ధృవతార: జెపి
చలన చిత్ర వినీలాకాశంలో ఓ ధృవతార రాలిపోయిందని లోక్‌సత్తా పార్టీ అధ్యక్షులు జయప్రకాశ్ నారాయణ అన్నారు. అక్కినేని మానవత్వం మూర్తీభవించిన మనిషి అన్నారు.
నన్నపనేని ఉద్వేగం
అక్కినేని మృతితో ఓ మహా నటుడిని కోల్పోయామని టిడిపి నేత నన్నపనేని రాజకుమారి ఉద్వేగానికి లోనయ్యారు. సినీ పరిశ్రమను హైదరాబాదుకు తీసుకు వచ్చిన వారిలో ఆయన ఒకరన్నారు. కేవలం నటుడిగానే కాకుండా సంఘ సంస్కర్తగా పేరుగాంచారన్నారు. ఆయన చిత్రాల్లో ఎక్కువగా సందేశాత్మక చిత్రాలు, సమాజాన్ని బాగు చేసే చిత్రాలే ఉన్నాయన్నారు.
కాగా, అక్కినేని భౌతికాయానికి సినీ ప్రముఖులు మోహన్ బాబు దంపతులు, శ్రీకాంత్, రాజేంద్ర ప్రసాద్, గవర్నర్ నరసింహన్, సిఎం కిరణ్, టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు, డిప్యూటి సిఎం దామోదర, పిసిసి చీఫ్ బొత్స, కేంద్రమంత్రి చిరంజీవి, టిడిపి నేత హరికృష్ణ, కాంగ్రెసు సీనియర్ నేత డి శ్రీనివాస్ తదితరులు నివాళులు అర్పించారు. మంత్రులు డికె అరుణ, కాసు వెంకటకృష్ణా రెడ్డి, పొన్నాల లక్ష్మయ్య, కాంగ్రెసు నేతలు పొంగులేటి సుధాకర్ రెడ్డి, తులసి రెడ్డి, బిజెపి రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డిలు సంతాపం తెలిపారు.
-
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
ఎట్టకేలకు జీవన్ రెడ్డి చేరే పార్టీ ఖరారు, అదే బాటలో..!! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
పాకిస్తాన్ క్రికెట్ కు ఓ దండం..మెయిన్ విలన్ ఆయనే: కిర్స్టెన్ -
"ధురంధర్" డైరెక్టర్ నెక్స్ట్ సినిమా ఆ స్టార్ హీరోతోనే ??? -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
డైరెక్ట్ గా ఇరాన్ నుంచే భారత్ ఆయిల్ కొనుగోళ్లు: గ్యాస్ కొరతకూ చెక్ -
డొనాల్డ్ ట్రంప్ సడన్ యూటర్న్- యుద్ధ విరామం












Click it and Unblock the Notifications