చిరంజీవికి సర్జరీ పూర్తి - మెగా ఫ్యాన్స్ కు సుస్మిత గుడ్ న్యూస్..!!

ప్రముఖ సినీ నటుడు చిరంజీవికి మోకాలికి స్వల్ప శస్త్రచికిత్స జరిగింది. రెండు రోజుల క్రితం ఢిల్లీలోని ఓ ప్రముఖ ప్రయివేటు ఆస్పత్రిలో చిరింజీవి సర్జరీ చేయించుకున్నారు. మోకాలిలో తరచూ నొప్పి రావటంతో పరీక్షలు చేయించుకున్నారని సమాచారం. ఈ మేరకు ఎలాంటి కోత లేకుండా ఆర్ద్రోస్కోపిక్ ద్వారా ఇన్ఫెక్షన్ తొలిగించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం అక్కడే చిరంజీవి విశ్రాంతి తీసకకుంటున్నారు. నాలుగైదు రోజులు హైదరాబాద్ రానున్నారు.

మోకాలి సర్జరీ సక్సెస్: చిరంజీవి గత కొన్నాళ్లుగా మోకాలి నొప్పితో బాధపడుతున్నారు. వరుసగా సినిమా షూటింగ్స్‌లో బిజీగా ఉన్న ఆయనకు ఇప్పుడు కాస్త విరామం దొరకడంతో మోకాలి నొప్పికి సంబంధించిన సర్జరీని చేయించు కున్నట్లు సమాచారం. ఢిల్లీలోని ఓ కార్పోరేట్‌ వైద్యశాలలో ఆర్థోస్కోపి నీ వాష్‌ ట్రీట్ మెంట్ ద్వారా చికిత్స తీసుకుంటున్నారు.

Chiranjeevi Knee Surgery Success in Delhi Hospital, All Set for Megastar new movie to launch on August 22nd

ప్రస్తుతం ఢిల్లీలోనే ఉన్న ఆయన వారం రోజుల విశ్రాంతి తరువాత హైదరాబాద్‌కు రానున్నారు. ఆగస్టు 22న చిరంజీవి జన్మదినం రోజున ఆయన నటించనున్న నూతన చిత్రం ప్రారంభం కానుంది. 'బంగార్రాజు' ఫేమ్‌ కల్యాణ్‌కృష్ణ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కనుంది.

మెగా బర్త్ డే స్పెషల్: మెగాస్టార్ చిరంజీవి నటించిన తాజా చిత్రం భోళా శంకర్ రిలీజైన తర్వాత చెకప్ కోసం ఢిల్లీ వెళ్లారు. డాక్టర్లు పరిస్థితిని సమీక్షించి మోకాలికి ఆపరేషన్ చేయాలని చెప్పారు. దీంతో శస్త్ర చికిత్స చేశారు. గతంలో భుజానికి సంబంధించిన సమస్యలతో బాధపడిన ఆయన.. ఇప్పుడు మోకాలు సమస్యతో బాధపడుతుండటంతో మోగా అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఇప్పటికే భోళా శంకర్ మీద విపరీతమైన ట్రోలింగ్ జరుగుతోంది. చిరుకు ఉన్న డ్యాన్స్, యాక్టింగ్, కామెడీ టైమింగ్ మరే పెద్ద హీరోకు లేవని అలాంటి చిరంజీవి రిమేక్ చిత్రాలను ఎందుకు తీస్తున్నారని సోషల్ మీడియా వేదికగా చర్చ సాగుతంది.

Chiranjeevi Knee Surgery Success in Delhi Hospital, All Set for Megastar new movie to launch on August 22nd

కుమార్తె సుస్మిత నిర్మాతగా: ఇదే సమయంలో మరో ఆసక్తి కర నిర్ణయం బయటకు వచ్చింది. ఈ నెల 22న చిరంజీవి జన్మదినం. ఆ రోజన దర్శకుడు కళ్యాణ కృష్ణ దర్శకత్వంలో టాలీవుడ్ మెగా స్టార్ చిరంజీవి 'బ్రో డాడీ' సినిమా ఎనౌన్స్‌మెంట్..ఫస్ట్ లుక్ విడుదల చేయటానికి మూవీ మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.

సుస్మిత కొణిదెల తన గోల్డ్ బాక్స్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై బ్రో డాడీ తెలుగు రీమేక్‌ను నిర్మించనుంది. కోలీవుడ్ బ్యూటీ క్వీన్ త్రిష ఈ సినిమాలో చిరుతో రొమాన్స్ చేయనున్నట్లు లేటెస్ట్ టాక్. దీంతో, భోళా శంకర్ మిగిచ్చిన నిరాశ నుంచి బయటకు వచ్చేలా సుస్మిత తన తండ్రి బర్త్ డే ముహూర్తంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తాజా సమాచారం.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+