సంక్రాంతి తర్వాత పునర్వ్యస్తీకరణ: సిడబ్ల్యుసిలోకి చిరంజీవి, కెవిపి కూడా?

న్యూఢిల్లీ: పార్టీ అత్యున్నత నిర్ణాయక సంస్థ కాంగ్రెసు వర్కింగ్ కమిటీ (సిడబ్ల్యుసి)లోకి రాజ్యసభ సభ్యుడు చిరంజీవిని తీసుకునే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. సంక్రాంతి పండుగ తర్వాత అఖిల భారత కాంగ్రెస్‌ కమిటీ(ఏఐసీసీ), సీడబ్ల్యూసీలను పునరుద్ధరించాలని ఆ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ, ఉపాధ్యక్షుడు రాహుల్‌ గాంధీ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో సంక్రాంతి తర్వాత పార్టీ అత్యున్నత వేదికలైన సీడబ్ల్యూసీ, ఏఐసీసీ నియామకాలు జరుగుతాయంటూ వార్తలు వస్తున్నాయి.

సమైక్య ఆంధ్రప్రదేశ్‌లో కె.కేశవరావు సీడబ్ల్యూసీకి ప్రాతినిధ్యం వహించారు. అనుబంధ సభ్యుడిగా సంజీవరెడ్డి కూడా ఉండేవారు. ఆ తర్వాత కావూరి సాంబశివరావుకు సిడబ్ల్యుసిలో స్థానం కల్పించారు. అయితే దాన్ని ఆయన తిరస్కరించారు. రాష్ట్ర విభజన తర్వాత సంభవించిన పరిణామాల నేపథ్యంలో చిరంజీవిని సిడబ్ల్యుసిలోకి తీసుకోవాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది.

Chiranjeevi and KVP may get berths in CWC

రాష్ట్ర విభజన నేపథ్యంలో లోక్‌సభ, శాసనసభల్లో ఆంధ్రప్రదేశ్ నుంచి కాంగ్రెస్‌ ప్రాతినిధ్యమే లేకుండా పోయింది. దీంతో పార్టీ పునరుజ్జీవానికి సీడబ్ల్యూసీ, ఏఐసీసీల్లో వీలైనన్ని ఎక్కువ పదవులను ఏపీకి ఇవ్వాలని అధిష్ఠానం కూడా సుముఖంగా ఉన్నట్లు తెలుస్తోంది. అయితే, ఇటీవలి కాలంలో కాంగ్రెస్‌ వ్యవహారాల్లో చిరంజీవి పెద్దగా జోక్యం చేసుకోవటం లేదని అంటున్నారు.

ఏపీలో పార్టీ ఏ కార్యక్రమాన్ని చేపట్టినా ఆయన హాజరు కావటం లేదని తెలిసింది. పీసీసీ ఆహ్వానిస్తున్నప్పటికీ ఆయన సున్నితంగా తిరస్కరిస్తున్నట్లు సమాచారం. నిరుడు పుణెలోని ఎఫ్‌టీఐఐలో ధర్నా చేస్తున్న విద్యార్థుల్ని కలిసి మద్దతు తెలిపేందుకు వెళ్లాలని నిర్ణయించిన రాహుల్‌ స్వయంగా చిరంజీవికి ఫోన్‌ చేసి ఆయన్ను కూడా వెంట తీసుకుని వెళ్లారు.

ఇదిలావుండగా, సీడబ్ల్యూసీ సభ్యత్వానికి ఏపీ నుంచి రాజ్యసభ సభ్యుడు కెవిపి రామచంద్రరావు పేరు కూడా అధిష్ఠానం పరిశీలనలో ఉంది. అయితే, పార్టీ ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా సీడబ్ల్యూసీ సభ్యత్వం చిరంజీవికి ఇవ్వటమే ఉత్తమమని అధిష్ఠానం పెద్దలకు కెవిపి చెప్పినట్లు తెలిసింది. కాపు సామాజిక వర్గాన్ని తిరిగి చేరువ చేసుకోవడానికి చిరంజీవి ప్రాతినిధ్యం పనికి వస్తుందని అంచనా వేస్తున్నట్లు సమాచారం.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+