నా జీవితంలో గొప్ప టర్నింగ్ పాయింట్ - చిరంజీవి..!!
చిరంజీవి నాలుగు దశాబ్దాల సినీ ప్రయాణంలో ఆ మూవీకి ఒక ప్రత్యేకత ఉంది. "ఖైదీ" సినిమా చిరంజీవి సినీ జీవితం కొత్త టర్న్ తీసుకుంది. టాలీవుడ్ కలెక్షన్ల లెక్కల రూపురేఖల్ని మార్చేసిన సినిమా ఖైదీ. చిరంజీవి సినిమాల్లో కలెక్షన్ల స్టామినా చూపించిన సినిమా ఇది. ఈ సినిమా విడుదలై 40 ఏళ్లు పూర్తయిన వేళ చిరంజీవి తన మనసులో మాటను అభిమానులతో షేర్ చేసుకున్నారు. 'ఖైదీ' చిత్రం నిజంగానే అభిమానుల గుండెల్లో తనను శాశ్వత 'ఖైదీ'ని చేసిందని..తన జీవితంలో ఓ గొప్ప టర్నింగ్ పాయింట్ ఆ చిత్రం నిలిచిపోతుందన్నారు.
చిరంజీవి, మాధవి జంటగా ఎ.కోదండరామిరెడ్డి దర్శకత్వం వహించారు. సంయుక్తా మూవీస్ పతాకంపై ధనుంజయరెడ్డి, కె.నరసారెడ్డి, ఎస్.సుధాకరరెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించారు. 'ఖైదీ' చిత్రం 1983 అక్టోబర్ 28న విడుదలైంది. అంటే నేటికి ఈ చిత్రం విడుదలై నాలుగు దశాబ్ధాలు పూర్తయింది. ఈ చిత్రంతో చిరంజీవి అభిమానుల గుండెలో శాశ్వత ఖైదీగా నిలిచిపోయారు. బెయిల్ దొరకని 'ఖైదీ' లా తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో బందీ అయిపోయారు. ఖైదీ చిత్రం 40 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా చిరంజీవి ట్వీట్ చేశారు.

చిరంజీవి తన ట్వీట్ లో..'ఖైదీ' చిత్రం నిజంగానే అభిమానుల గుండెల్లో నన్ను శాశ్వత 'ఖైదీ'ని చేసింది. నా జీవితంలో ఓ గొప్ప టర్నింగ్ పాయింట్ ఆ చిత్రం. ఆ చిత్రాన్ని ప్రేక్షకులు ఆదరించిన తీరు ఎప్పటికీ మరువలేను. ఖైదీ విడుదలై నేటికి 40 సంవత్సరాలైన సందర్భంగా ఆ జ్ఞాపకాలను నెమరువేసుకుంటూ ఆ చిత్ర దర్శకులు ఎ.కోదండరామిరెడ్డిగారిని నిర్మాతలు సంయుక్తా మూవీస్ టీమ్‌ని, నా కోస్టార్స్ సుమలత, మాధవి మొత్తం టీమ్‌ను అభినందిస్తూ, అంత గొప్ప విజయాన్ని మాకు అందించిన తెలుగు ప్రేక్షకులు అందరికీ నా హృదయ పూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నాను'' అని ట్వీట్‌లో చిరంజీవి పేర్కొన్నారు. ఈ ట్వీట్ ఇప్పుడు వైరల్ అవుతోంది.
'ఖైదీ' చిత్రం నిజంగానే అభిమానుల గుండెల్లో నన్ను శాశ్వత 'ఖైదీ'ని చేసింది.
— Chiranjeevi Konidela (@KChiruTweets) October 28, 2023
నా జీవితంలో ఓ గొప్ప టర్నింగ్ పాయింట్ ఆ చిత్రం ! ఆ చిత్రాన్ని ప్రేక్షకులు ఆదరించిన తీరు ఎప్పటికీ మరువలేనిది.
ఖైదీ విడుదలై నేటికి 40 సంవత్సరాలయిన సందర్భంగా ఒక సారి
ఆ జ్ఞాపకాలను నెమరువేసుకుంటూ ,
ఆ చిత్ర… pic.twitter.com/raY4AOTAoH
ఈ చిత్రానికి చిరంజీవి రూ.1,75,000 పారితోషికంగా అందుకున్నారు. కోదండరామిరెడ్డి రూ.40,000 అందుకున్నారు. ఈ చిత్రం 100 రోజుల వేడుకకు కృష్ణ అతిథిగా హాజరయ్యారు. 'ఖైదీ' 1983 సంవత్సరానికి అత్యధిక వసూళ్లు రాబట్టిన సినిమాగా రికార్డు సృష్టించింది. ఆరోజుల్లో ఈ సినిమాకు 3.2 కోట్ల టికెట్లు అమ్మకాలు జరిగాయి. ఇది ఆ టైమ్‌లో పెద్ద రికార్డుగా చెబుతారు. అసలు ఈ చిత్రాన్ని 'ఖైదీ' సూపర్‌స్టార్ కృష్ణ చేయాలి. కానీ కొన్ని కారణాల వల్ల ఆయన చేయలేకపోయారు. దాంతో చిరంజీవికి ఆ అవకాశం దక్కింది. తొలుత ఈ చిత్రానికి కె.రాఘవేంద్రరావు డైరెక్ట్ చేయాలనుకున్నారు. అది కూడా కుదరకపోవడంతో కోదండరామిరెడ్డిని ఆ అవకాశం వరించింది. ఈ సినిమాలో రగులుతోంది మొగలి పొద పాట ఇప్పటికీ ఓ సంచలనమే.












Click it and Unblock the Notifications