పవన్ పార్టీపై చిరంజీవి, ఆ తర్వాతేనని కల్వకుంట్ల కవిత

హైదరాబాద్/న్యూఢిల్లీ: తన సోదరుడు, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ జనసేన పార్టీ పైన కేంద్ర పర్యాటక శాఖ మంత్రి చిరంజీవి స్పందించారు. ప్రజాస్వామ్యంలో ప్రజలకు సేవ చేసే హక్కు అధికారం, అవకాశం అందరికీ ఉందని చెప్పారు. వ్యక్తిగతంగా పార్టీ పెట్టడం అనేది పవన్ ఇష్టమన్నారు.

కాగా, పవన్ పార్టీ పెట్టినా తాను చిరుతోనే ఉంటానని నాగబాబు గురువారం చెప్పిన విషయం తెలిసిందే. చిరు తనకు, పవన్‌కు, రామ్ చరణ్ తేజకు రాచమార్గం తయారు చేశారని, ఆ రాజ మార్గం కోసం ఆయన ఎన్నో కష్టాలు పడ్డారని, తమ్ముళ్లకే కాకుండా అభిమానులకీ ఎంతో గుర్తింపు తెచ్చారన్నారు. అన్నయ్య వేసిన రాచమార్గంలో వెళ్లే తాను, పవన్, చరణ్, అల్లు అర్జున్, అల్లు అరవింద్ ఎవరి స్థాయికి తగ్గ విధంగా గుర్తింపునీ, పేరును సంపాదించుకున్నామన్నారు. తాను, మెగా అభిమానులు చిరుతోనే ఉంటామన్నారు.

Chiranjeevi on Pawan Kalyan Party

క్షమాపణ చెప్పి పార్టీ పెట్టాలి: కవిత

చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు పవన్ కల్యాణ్ తెలంగాణలో ప్రచారం చేశారని, తమ ప్రాంత ప్రజలను మోసం చేశారని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత గురువారం అన్నారు. సొంత పార్టీ పెట్టుకోవడానికి పవన్ కళ్యాణ్‌కు హక్కుందని, అయితే, సామాజిక తెలంగాణ అని మోసం చేసినందుకు పవన్ మొదట తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పెట్టబోయే రాజకీయ పార్టీపై తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు స్పందించిన విషయం తెలిసిందే. తెలుగు ప్రజలు ఇబ్బందుల్లో ఉన్నారని, ఇది కొత్త ప్రయోగాలకూ రాజకీయాలకు సమయం కాదని అన్నారు. సుస్థిర పాలన ఉంటేనే తెలుగు ప్రజల అభివృద్ధి జరుగుతుందన్నారు. తమ పార్టీ మాత్రమే సుస్థిర పాలనను అందిస్తుందని చంద్రబాబు అన్నారు.

ఎపి కాపునాడు ప్రతినిధులు గురువారంనాడు చంద్రబాబును కలిశారు. తెలుగుదేశం పార్టీకి వారు మద్దతు ప్రకటించారు. పవన్ కళ్యాణ్ పార్టీ పెడితే వైయస్ జగన్ నాయకత్వంలోని వైయస్సార్ కాంగ్రెసు పార్టీకి మేలు జరుగుతుందని, దానివల్ల కాపులకు చెడు జరుగుతుందని వారన్నారు. కాపులకు అన్యాయం జరగకుండా పవన్ కళ్యాణ్ చూడాలని వారు కోరారు. గతంలో చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ పెట్టి వైయస్ రాజశేఖర రెడ్డికి ప్రయోజనం చేకూర్చి పెట్టారని, ఇప్పుడు పవన్ కళ్యాణ్ పార్టీ పెడితే వైయస్ జగన్‌కు మేలు జరిగే అవకాశం ఉందని వారన్నారు. కాపులకు అన్యాయం జరిగితే ఎవరినైనా ఎదిరిస్తామని వారన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+