పవన్ కళ్యాణ్ ప్రత్యర్థి, పార్టీపై ఊహించలేదు: చిరంజీవి

హైదరాబాద్: తన తమ్ముడు పవన్ కళ్యాణ్ స్థాపించిన జనసేన పార్టీ కూడా మిగతా ఇతర పార్టీల వలె తమ పోటీ పార్టీ అని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి, కాంగ్రెసు పార్టీ సీనియర్ నేత చిరంజీవి అంటున్నారు. పవన్ ఇలా పార్టీ పెడతాడని ఊహించలేదని చెబుతున్నారు. ప్రతి ఒక్కరిలోను ఎవరి అభిప్రాయాలు వారికి ఉంటాయన్నారు. పవన్ పార్టీ పెడుతున్నారనే విషయం తెలియడంతో దానిపై తాను ఆరా తీశానని, తనకు అలాంటి ఉద్దేశ్యం లేదని పవన్ అప్పుడు చెప్పారని అంటున్నారు.

ఆ తర్వాత కొద్ది రోజులకు కూడా పవన్ పార్టీ గురించి తెలిసి నాగబాబు ద్వారా వాకబు చేశానన్నారు. వారి వారి నిర్ణయాల పైన తాను ఎవరిని ఏ విషయంలోను నిరుత్సాహపరచనని తెలిపారు. పవన్ ప్రస్తుతం సినిమాల్లో నెంబర్ వన్‌గా ఉన్నారని చెప్పారు. కెరీర్ పీక్ స్టేజిలో ఉన్నప్పుడు ఆయన రాజకీయాల్లోకి వచ్చారని అభిప్రాయపడ్డారు. అతనికి సొంతిల్లు లేదని, అతను చాలా డబ్బు కోల్పోయాడన్నారు.

Chiranjeevi on Pawan Kalyan's Jana Sena

పవన్ కళ్యాణ్‌కు ఆసక్తి ఉంటే 2019లో పోటీ చేయడం మంచిదని, ప్రస్తుతం సినిమాలకు పరిమితం బాగుంటుందని అభిప్రాయపడ్డారు. ఈ విషయంలో పవన్‌ను ఒప్పించాలని నాగబాబుకు సూచించానని తెలిపారు. అయితే, తాను పార్టీ పెట్టడం లేదని, రాజకీయాల్లోకి రావడం లేదని నాగబాబుతో చెప్పారని, ఆ తర్వాత పవన్‌ను కలిసి నచ్చజెప్పాలని చూశానని చెబుతున్నారు.

పవన్ పార్టీని ప్రకటించే రెండు రోజుల ముందు కలవాలనుకున్నానని, తాను జనసేన పార్టీ ప్రకటన సమయంలో టివిలో చూశానని తెలిపారు. జనసేన ఇతర పార్టీల్లాగే తమకు ప్రత్యర్థి పార్టీ అని చెప్పారు. భారత దేశానికి స్వాతంత్రం తీసుకు వచ్చిన కాంగ్రెసు పార్టీని తరిమేయాలని పవన్ చెప్పడం సరికాదని అభిప్రాయపడ్డారు. పవన్ కళ్యాణ్‌ను తాను ఎన్నికల్లో ఎదుర్కోనివ్వండని చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+