చిరు, పవన్ పార్ట్‌టైమర్స్: కిరణ్ రెడ్డి సహా మిగతా వారేమయ్యారు? (పిక్చర్స్)

హైదరాబాద్: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని రాజకీయాల్లో ఓ వెలుగు వెలిగిన రాజకీయ నేతలు ఇప్పుడు కొందర మచ్చుకైనా కనిపించడం లేదు. అన్ని పార్టీల్లోనూ ఇదే పరిస్థితి నెలకొని ఉంది. కాంగ్రెసు రాజ్యసభ సభ్యుడు చిరంజీవి తన 150 సినిమాలో బిజీగా ఉండిపోయి కాంగ్రెసు రాజకీయాల పట్ల అంటీముట్టనట్లు వ్యవహరిస్తున్నారు.

జనసేన పార్టీని స్థాపించిన పవన్ కళ్యాణ్ అప్పుడప్పుడు రాజకీయ తెర మీదికి వస్తూ పోతూ ఉన్నారు. ఆయన కూడా సినిమాల్లో బిజీ అయిపోయారు. ఈ అన్నదమ్ముల పరిస్థితి ఇలా ఉంటే మిగతావారి పరిస్థితి ఏమిటనేది ప్రశ్నార్థకంగానే మారింది.

వైయస్సార్ కాంగ్రెసు పార్టీ గౌరవాధ్యక్షురాలు వైయస్ విజయలక్ష్మి ఇప్పుడు తన గొంతు విప్పడం లేదు. ఆమె కూతురు వైయస్ షర్మిల మాత్రం అప్పుడప్పుడు తెలంగాణలో యాత్రలు చేస్తూ వస్తున్నారు. కానీ, అవి పెద్దగా ప్రభావం చూపించడం లేదు. మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి వంటివారు అసలు కనిపించడం లేదు.

కిరణ్ కుమార్ రెడ్డి ఇలా..

కిరణ్ కుమార్ రెడ్డి ఇలా..

సమైక్యాంధ్రప్రదేశ్ చివరి ముఖ్యమంత్రి నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి చేసిన సందడి చిన్నదేమీ కాదు. తెలంగాణను అడ్డుకోవడానికి శాయశక్తులా పనిచేశారు. తనకు రాజకీయ జన్మనిచ్చిన కాంగ్రెస్‌ను కూడా ఎదిరించి, అసెంబ్లీలో విభజనకు వ్యతిరేకంగా ఓటింగు చేయించారు. చివరకు పార్టీకి రాజీనామా చేసి, జైసమైక్యాంధ్ర పార్టీ ప్రారంభించారు. కానీ, అందులో తన సోదరుడు సహా, ఒక్క సీటు కూడా గెలిపించుకోకపోయారు.

కిరణ్ కుమార్ రెడ్డి ఇలా కాలక్షేపం

కిరణ్ కుమార్ రెడ్డి ఇలా కాలక్షేపం

మార్నింగ్ వాకింగ్, మధ్యలో గోల్ఫ్, బెంగళూరు, అమెరికా ప్రయాణాలతో కిరణ్ కుమార్ రెడ్డి కాలక్షేపం చేస్తున్నారు. చివరకు సొంత నియోజకవర్గానికీ దూరమయ్యారు. బిజెపిలో చేరేందుకు ప్రయత్నిస్తున్నారు. కానీ ఢిల్లీ నుంచి ఇంకా లైన్‌క్లియర్ కాలేదు.

లగడపాటి ఏం చేస్తున్నారు..

లగడపాటి ఏం చేస్తున్నారు..

విజయవాడలో ఆమరణ నిరాహారదీక్ష చేసి, అక్కడి నుంచి హైదరాబాద్‌కు వచ్చి, నిమ్స్‌లో ఉరుకులు పరుగులతో బెడ్‌మీద చేరి, చివరకు తాను తిట్టిపోసిన కెసిఆర్‌తో ఐలవ్‌యు అని చెప్పించుకున్న లగడపాటి రాజగోపాల్ ఎక్కడా కనిపించడం లేదు. తాను రాజకీయ సన్యాసం చేశానని ప్రకటించుకున్నారు.

వ్యాపార కార్యక్రమాలే..

వ్యాపార కార్యక్రమాలే..

తెలంగాణ-ఆంధ్రలో వ్యాపార కార్యాలయాలు మూసి, ఢిల్లీకి బదిలీ అయ్యారు. కొందరి కుటుంబ కార్యకలాపాలకు మాత్రం హాజరవుతున్నారు. చక్కగా రాజకీయ వ్యాపారాలతో కాలక్షేపం చేసుకుంటున్నారు. ఇటీవల గ్రేటర్ హైదరాబాద్ సర్వే ఫలితాలపై ఓ టీవీ చానెల్‌తో మాట్లాడారు.

చిరంజీవి ఇలా..

చిరంజీవి ఇలా..

కేంద్రమంత్రిగా పనిచేసిన చిరంజీవి ఇప్పుడు, కేవలం రాజ్యసభ సభ్యుడు. ఆయన గ్లామర్ ఎన్నికల్లో కాంగ్రెస్‌ను గెలిపించలేకపోయింది. ఎన్నికల తర్వాత కూడా చిరంజీవి పర్యటించిన దాఖలాలు లేవు. కొన్నాళ్లు కాంగ్రెసు కార్యకలాపాల్లో కనిపించారు. కొడుకు చరణ్‌ను సినిమాల్లో ప్రమోట్ చేసే పనిలో బిజీగా ఉన్నారు. రాజకీయ వేదికపై కంటే సినిమా ఫంక్షన్లలోనే ఎక్కువగా కనిపిస్తున్నారు.

పవన్ కళ్యాణ్ ఇలా...

పవన్ కళ్యాణ్ ఇలా...

పవన్ కళ్యాణ్ జనసేన పార్టీని స్థాపించారు. కానీ ఆయన ఎప్పుడు కనిపిస్తారో, ఎప్పుడు మాట వినిపిస్తారో కూడా తెలియని పరిస్థితి ఉంది. రెండు, మూడు సార్లు రాజధాని రైతుల వద్దకు వెళ్లి, పలకరించారు. కొద్దిరోజుల క్రితం హెలికాప్టర్‌లో విజయవాడ వచ్చి చంద్రబాబుకలిసి, మళ్లీ అదే హెలికాప్టర్‌లో వెళ్లిపోయారు.

వైయస్ విజయలక్ష్మి ఇలా..

వైయస్ విజయలక్ష్మి ఇలా..

ఎన్నికల ముందు రాష్ట్రంలో చేతులో బైబిల్ పట్టుకుని పర్యటించిన జగన్ తల్లి విజయలక్ష్మి, మళ్లీ ఇప్పటిదాకా తెరపైకి రాలేదు. విశాఖలో ఓటమి తర్వాత క్రియాశీల రాజకీయాల్లో కనిపించడం మానేశారు. వైఎస్ వర్థంతి-జయంతిలో మాత్రమే కనిపిస్తున్నారు.

జగన్ బాబాయ్...

జగన్ బాబాయ్...

ఇక జగన్ బాబాయ్ వైఎస్ వివేకానందరెడ్డి కూడా ఎప్పుడో గానీ కనిపించడం లేదు. వైఎస్ ఉన్నప్పుడు కడప జిల్లాను శాసించిన ఆయన, ఇప్పుడు పులివెందులలో కాలక్షేపం చేస్తున్నారు. చివరకు అబ్బాయ్ కూడా పట్టించుకోవడం మానేశారు.

వైయస్ షర్మిల ఇలా..

వైయస్ షర్మిల ఇలా..

జగన్ సోదరి షర్మిల, ఓదార్పు ఎపిసోడ్‌లో తప్ప ఎక్కడా కనిపించడం లేదు. ఎప్పుడైనా ఓదార్పులో కనిపించడం, తర్వాత బెంగుళూరులో నివాసం ఉంటున్నారు. ప్రస్తుతం ఆమె అవసరం పార్టీకి పెద్దగా ఉన్నట్లు లేదు.

నందమూరి హరికృష్ణ

నందమూరి హరికృష్ణ

గత ఎన్నికల ముందు వరకూ తెలుగుదేశంలో హడావిడి చేసిన ఎన్టీఆర్ కుమారుడు నందమూరి హరికృష్ణ, ఇప్పడు పార్టీలో కూడా పెద్దగా కనిపించడం లేదు. ఏదైనా పెళ్లి ఫంక్షన్లు, సినిమా ఫంక్షన్లు, తప్పితే ఎన్టీఆర్ వర్థంతి, జయంతిలోనే దర్శనమిస్తున్నారు.

విజయశాంతి ఏం చేస్తున్నారు...

విజయశాంతి ఏం చేస్తున్నారు...

కేసీఆర్‌తో తన చెల్లెలుగా పిలిపించుకుని, టీఆర్ఎస్‌కు సెక్రటరీ జనరల్‌గా పనిచేసిన విజయశాంతి జాడ తెలియడం లేదు. టీఆర్ఎస్‌కు రాజీనామా చేసి, కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన తర్వాత రాములమ్మ మాట వినిపించడం లేదు. అప్పుడెప్పుడో తానూ ఉన్నానని ఒకసారి పత్రికాప్రకటనలో కనిపించారు.

డిఎల్ రవీంద్రా రెడ్డి ఏరీ....

డిఎల్ రవీంద్రా రెడ్డి ఏరీ....

కిరణ్‌కుమార్‌రెడ్డికి వ్యతిరేకంగా బహిరంగంగా గళం విప్పి మంత్రివర్గం నుంచి బహిష్కృడైన మాజీ మంత్రి డీఎల్ రవీందర్‌రెడ్డి కూడా ఎక్కడా తన ఉనికిని ప్రదర్శించడం లేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+