చిరంజీవి రీఎంట్రీ అదుర్స్: కానీ ఏం చేశారంటూ బహిరంగ లేఖ

ఖైదీ నంబర్ 150తో చిరంజీవి సినిమాల్లోకి ఇచ్చిన రీఎంట్రీని ప్రశంసిస్తూనే రైతుల విషయంలో ఓ వైబ్‌సైట్ ప్రశ్నలు సంధిస్తూ బహిరంగ లేఖ రాసింది.

హైదరాబాద్: చిరంజీవి సినిమాలోకి రీఎంట్రీ అదిరిపోయింది. ఆయన 150వ చిత్రం ఖైదీ నంబర్ 150 ప్రేక్షకులను అలరిస్తోంది. కానీ, ఆయన రాజకీయంగా కొన్ని ప్రశ్నలను ఎదుర్కుంటున్నారు. ఖైదీ నంబర్ 150 సినిమాతో తెలుగు తెరపై అద్దిరిపోయే రీ-ఎంట్రీ ఇచ్చినందుకు హృదయపూర్వక అభినందనలంటూనే కొరడా డాట్ కామ్ అనే వెబ్‌సైట్ ఆయనకు ఓ బహిరంగ లేఖను సంధిస్తూ కొన్ని ప్రశ్నలువేసింది.

సినిమా చాలా బాగుందని, తెరపై మిమ్మల్ని చూస్తుంటే, మీ వయసు 35 అని ప్రేక్షకులు ఫిక్స్ అయిపోవడం ఖాయమని, మీ డాన్సుల్లో గ్రేస్ తగ్గలేదని, మీ కళ్ళలో మెరుపు తగ్గలేదని, మీ డైలాగ్స్ లో పదును తగ్గలేదు, మీ కామెడి టైమింగ్ లో చిన్న తేడా కూడా రాలేదని, తెరపై ఇంకెవరెవరు ఉన్నారో కూడా చాలా మంది ప్రేక్షకులు పట్టించుకోలేదని అంటూ ఇంకా - కళ్ళు మీ మీదే నిలిచిపోయాయని, మీ కళ్ళలోనే ఏదో పవర్ ఉంది చిరంజీవి గారూ.. పదేళ్ళ తర్వాత తెరపై కనిపించినా, ప్రేక్షకులు మిమ్మల్ని 'ఇంద్ర', 'ఘరానా మొగుడు' సమయంలో ఎలా ఆదరించారో, ఇప్పుడూ అలాగే ఆదరిస్తున్నారని పొగడేస్తూ వచ్చింది.

ఆ వార్తాకథనం ఇంకా ఇలా సాగింది - దీనికి కారణం 'పునాదిరాళ్లు' నుంచి మీరు వేసుకున్న పునాది; మీ శ్రమ, మీ పట్టుదల, వళ్ళు హూనమయ్యేలా మీరు కష్టపడి చేసిన డాన్సులు, వీటన్నిటికి తోడు, మీ బావమరిది అల్లు అరవింద్ గారి వ్యూహరచనా సామర్థ్యం.

ఆ వార్తాకథనం ఇంకా ఇలా కొనసాగింది - ఒక సాధారణ కుటుంబంలో పుట్టిన కొణిదెల శివ శంకర ప్రసాద్ అనే యువకుడు, అసాధారణ విజయాలు సాధించడం వెనుక, మెగాస్టార్ గా ఎదగడం వెనుక లక్షలాదిమంది తమ్ముళ్ళ అభిమానంతో పాటు దైవ అనుగ్రహం కూడా ఉంది సర్. మీరే ఇంటర్వ్యూలలో చెప్పారు, "ఇదంతా నా పూర్వ జన్మ సుకృతం అని..". అది ముమ్మాటికీ నిజం సార్, మీరు గత జన్మలో దేవుడికి బంగారు పూలతో పూజచేయడమే కాదు, అంతకు మించి ఎన్నో సుకృతాలు (అంటే మంచి పనులు) చేసి ఉంటారు. అందుకే భగవంతుడు మిమ్మల్ని ఇంత బాగా చూసుకున్నాడు.

Chiranjeevi questioned for not working for the betterment of farmers

ఇవన్నీ చేశారు....

"మనకి దేవుడు పరీక్షలు పెడుతుంటాడు అని మన పెద్దవాళ్ళు ఒకమాట చెబుతారు. అంటే, కొందరిని పేదవారిగా పుట్టిస్తాడు, కొందరిని ధనవంతులుగా పుట్టిస్తాడు, కొందరిని పేదరికంలో పుట్టి అత్యంత ధనవంతులు అయ్యేలా చేస్తాడు. వీళ్ళలో ఎవరు మంచి పనులు చేస్తారు, ఎవరు ధర్మాన్ని పాటిస్తారు, ఎవరు తనకోసం జీవిస్తారు, ఎవరు తోటివారికి సహాయం చేస్తారు.. అని దేవుడు ఒక కంట గమనిస్తుంటాడట. మీరు మీకున్న గొప్ప మనసుతో, ఇప్పటికే బ్లడ్, ఐ బ్యాంకులు స్థాపించి ఎంతో మందికి ప్రాణదానం, దృష్టిదానం చేసారు. మీకున్న మంచి మనసుకి మీరు ఇంతకన్నా ఎన్నోరెట్లు మంచి పనులు చేయగలరు సర్" అంటూ ఆ వార్తాకథనంలో వ్యాఖ్యానించారు.

"ఖైదీ నంబర్ 150'లో మీరు రైతుల సమస్యలని గుండెలకి హత్తుకునేలా చెప్పారు. మీరు రైతుల కోసం ఏమైనా చేయకూడదా సర్. ఆత్మహత్యలు చేసుకునే రైతులకి భరోసా ఇవ్వడం దగ్గర నుంచి, వ్యవసాయం లాభసాటిగా మార్చడం దాకా ఎన్నో పనులు ఉన్నాయి. వీటిలో మీ వంతు ప్రయత్నం మీరు చేస్తే ఎంత గొప్పగా ఉంటుంది. ఆంజనేయస్వామి ఎంత సంతోషిస్తాడు..! మీరు ఇంకా కనీసం 10 ఏళ్ళు సినిమాల్లో నటించగలరు. దేవుడు మీకా శక్తి ఇచ్చాడు. ఈ పదేళ్ళు మీరు సంపాదించే డబ్బులో 10వ వంతు ప్రజలకోసం ఖర్చు పెడితే ఎంత బాగుంటుంది. దీన్ని ఈ ఖైదీ నంబర్ 150 తోనే మొదలు పెడితే అద్భుతం కదా" అని కొరడా డాట్ కామ్ వ్యాఖ్యానించింది.

మీరు పూనుకుంటే చేయగలరంటూ...

"ఆత్మహత్యలు చేసుకున్న 150 రైతు కుటుంబాలకి సహాయం చేయడమో, లేదా ఒక 50 బీసీ ఎస్సీ హాస్టళ్ళలో పిల్లలకి మెరుగైన వసతులు కల్పించడమో లాంటి పనులు చేస్తే గొప్పగా ఉంటుంది. ఒక్కసారి ఆలోచించండి. మీరు పూనుకుంటే అద్భుతాలు చేయగలరు సర్. భగవంతుడు మీకా శక్తి ఇచ్చాడు, మంచి మనసు ఇచ్చాడు. 'ఖైదీ నంబర్ 150'తో హీరోగా సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టిన మీరు, సేవాకార్యక్రమాలలో కూడా సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టాలని మీ అశేష అభిమానులతో పాటు కొరడా.కాం కూడా కోరుకుంటోంది" అని చెప్పింది.

మొత్తం మీద కొరడా డాట్ కామ్ మెగాస్టార్ చిరంజీవికి పదునైన బహిరంగ లేఖనే సంధించింది. రైతుల కోసం చిరంజీవి చేసింది ఏమీ లేదనే విషయాన్ని నర్మగర్భంగా వ్యాఖ్యానించింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+