చిరంజీవి రోడ్ షోలు వెలవెల, జనం లేక కెసిఆర్ నారాజ్!

హైదరాబాద్: కేంద్ర పర్యాటక శాఖ మంత్రి, సీమాంధ్ర కాంగ్రెసు ప్రచార కమిటీ చైర్మన్ చిరంజీవి రోడ్డు షోలకు స్పందన కనిపించడం లేదా? అంటే అవుననే అంటున్నారు. 2008లో చిరంజీవి ప్రజారాజ్యం పార్టీని స్థాపించిన తర్వాత 2009లో సాధారణ ఎన్నికలలో జోరుగా ప్రచారం చేశారు. అప్పుడు ఆయన రోడ్డు షోలకు, సభలకు జనం పోటెత్తారు.

ఇప్పుడు ఆ స్థాయిలో చిరంజీవి రోడ్డు షోలకు జనం కనిపించడం లేదంటున్నారు. చిరంజీవి శనివారం విజయవాడలో రోడ్డు షో నిర్వహించారు. విజయవాడలో చిరు రోడ్డు షోకు జనం మరీ పల్చగా కనిపించారంటున్నారు. 2009లో పిఆర్పీ నుండి విజయవాడ పశ్చిమ నుండి పోటీ చేసిన వెల్లంపల్లి శ్రీనివాస్ ఇప్పుడు బిజెపిలో ఉన్నారు. నాడు చిరుకు అనూహ్య ఆదరణ లభించింది. కానీ ఇప్పుడు అది కనిపించడం లేదంటున్నారు.

జనం లేని కెసిఆర్ సభ

జోగిపేట పట్టణంలో శనివారం జరిగిన బహిరంగ సభలో తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షులు కల్వకుంట్ల చంద్రశేఖర రావు సభలో ప్రజలు లేకపోవడంతో ఆయన నారాజయ్యారట. నారాయణఖేడ్, జహిరాబాద్ సభలలో పాల్గొన్న కెసిఆర్ రెండు గంటలకు జోగిపేట పట్టణానికి హెలిక్యాప్టర్‌లో చేరుకున్నారు. అక్కడి నుండి కారులో వేదిక వద్దకు చేరుకోగానే అక్కడ జనం ఎక్కువ సంఖ్యలో కనిపించకపోవడంతో ఆయన పది నిమిషాల పాటు మాత్రమే మాట్లాడి వెంటనే స్టేషన్ ఘనపుర్ సభకు తరలి వెళ్లారు.

Chiranjeevi road show in Vijayawada

వాస్తవానికి జోగిపేటలో సభ వద్దన్నానని, ఇక్కడి నాయకులే పెట్టుకున్నారని, తనకు ఎక్కువ సమయం కూడా లేదని, మధ్యాహ్నం మూడు గంటలకు స్టేషన్ ఘనపూర్‌కు వెళ్లాల్సి ఉన్నందున మీకో నమస్కారం పెడతామని వచ్చానంటూ.. ఇటీవలె నిర్వహించిన సభలోనే అన్ని విషయాలు చెప్పుకున్నామని, జై తెలంగాణ జైజై తెలంగాణ అంటూ కెసిఆర్ ప్రసంగం ముగించారు.

జోగిపేటలో జరిగిన కేసిఆర్ బహిరంగ సభకు స్థానిక తెరాస నాయకులు జనాలను సమీకరించలేకపోయారు. గత నెల క్రితం పట్టణంలో నిర్వహించిన సభలో లక్షలాది మంది హాజరు కాగా నేటి ఎన్నికల సభలో ఆ స్థాయిలో హాజరు కాకపోవడంతో అసంత్తృప్తికి గురయ్యారట. తాను వద్దన్నప్పటికీ జోగిపేటలో సభ ఏర్పాటు చేయడంపై ఆయన నాయకులపై అసంతృప్తి వ్యక్తం చేశారట.

ఎండలు ముదరడంతో అనుకున్న స్థాయిలో జనం రాలేకపోయారని తెరాస నాయకులు భావిస్తున్నప్పటికీ పట్టణంలో కాంగ్రెస్ నాయకులు మాత్రం టిఆర్‌ఎస్ సభ ఫెయిల్ కావడంతో ఉత్సాహంగా ఉన్నారట. కాగా, పలువురు ఎండవేడిమికి తాళలేక సమీపంలోని చెట్లకింద పైన, షెడ్ల కింద ఉండిపోయారు. వారంతా సభలోకి రావాలని బాబూమోహన్ పదే పదే కోరినా కొందరు వచ్చి, ఇంకొందరు రాలేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+