వినాయక్ రెడీ:ఎన్నికల తర్వాతే చిరు 150వ సినిమా?

చిరంజీవి 150వ సినిమాకు వివి వినాయక్ పనిచేయనున్నట్లు సమాచారం. ఆయన ప్రస్తుతం స్క్రిప్టు మీద కూర్చున్నట్లు చెబుతున్నారు. వివి వినాయక్ ఠాగూర్ సినిమాకు దర్శకత్వం వహించిన విషయం తెలిసిందే. ఆయన తన కథను చిరంజీవికి ఎన్నికల తర్వాత వినిపిస్తారని సమాచారం.
చిరంజీవి 150వ సినిమా యాక్షన్, రోమాన్స్, కామెడీలతో వినోదాన్ని అందించే విధంగా ఉండడమే కాకుండా సందేశాన్ని కూడా ఇస్తుందని అంటున్నారు. ఈ సినిమాకు సంబంధించిన వివరాలను త్వరలోనే వెల్లడిస్తారని సమాచారం.
కాగా, వివి వినాయక్ ప్రస్తుతం బెల్లంకొండ సాయి శ్రీనివాస్, సమంత సినిమా నిర్మాణంలో బిజీగా ఉన్నట్లు తెలుస్తోంది. చిరంజీవి 150వ సినిమా ప్రారంభమై, పూర్తి కావడం అనేది జరుగుతుందా అనే సందేహాలు కూడా ఉన్నాయి.












Click it and Unblock the Notifications