జగన్ వైపు ధర్మాన: చిరంజీవి వర్గం హవా, కిల్లి అండ
శ్రీకాకుళం: మాజీ మంత్రి, ఇటీవలె కాంగ్రెసు పార్టీకి గుడ్ బై చెప్పి వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో చేరిన ధర్మాన ప్రసాద రావు వర్గం అనంతరం.. ఇక నుండి శ్రీకాకుళం జిల్లాలో కేంద్ర పర్యాటక శాఖ మంత్రి చిరంజీవి వర్గం హవా కొనసాగనుంది! గత కొన్నేళ్లుగా శ్రీకాకుళం జిల్లాలో ధర్మాన వర్గానిదే హవా.
ఇప్పుడు ధర్మాన సహా ఆయన వర్గం వైయస్సార్ కాంగ్రెసు పార్టీలోకి వెళ్లిపోయింది. ధర్మానతో పాటు జిల్లా కాంగ్రెసు పార్టీ కమిటి అధ్యక్షులు, మాజీ జిల్లా అధ్యక్షులు తదితరులు జగన్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు.

తాజాగా జిల్లా కాంగ్రెసు కమిటీ అధ్యక్షులుగా డోలా జగన్మోహన్ రావు బాధ్యతలు స్వీకరించారు. ఆయనకు చిరు వర్గానికి చెందిన నాయకులు అండగా ఉన్నారు. ఆయన జిల్లా సహకార కేంద్రీయ బ్యాంకు అధ్యక్షులుగా కూడా ఉన్నారు. గతంలో ప్రజారాజ్యం పార్టీలో పని చేసి... విలీనం తర్వాత కాంగ్రెసు నాయకులుగా ఉన్న ముస్తాక్ మహమ్మద్, కరుణాకర్, నాగేశ్వర రావు వంటి పలువురు నేతలు ఆయనకు మద్దతుగా ఉన్నారు.
డోలాతో కలిసి వారు జిల్లాలో పార్టీని బలోపేతం చేసే దిశగా పని చేస్తున్నారు. డోలాకు మరో కేంద్రమంత్రి కిల్లి కృపారాణి అండదండలు కూడా ఉన్నాయి. వీరంతా కలిసి పార్టీ పైన దృష్టి సారించారు. కిల్లి కృపారాణి కుటుంబానికి చిరుతో మంచి సంబంధాలు ఉన్నాయి. గతంలోను ఆమె చిరును పొగడ్తలతో ముంచెత్తిన సందర్భాలు ఉన్నాయి.
-
పెళ్లైన హీరోతో ఎఫైర్ వల్ల సినిమాల్లో బ్యాన్.. ఎవరా డ్రీమ్ గర్ల్ ?? -
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
ఉగాది నుంచి వృషభరాశి, మేషరాశి వారి జాతక ఫలం -
Work From Home ఇచ్చేశారు. ప్రభుత్వం, ఐటీ దిగ్గజాల కీలక ప్రకటన! -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
రైతులకు శుభవార్త.. రైతు భరోసాపై కీలక ప్రకటన చేసిన మంత్రి! -
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్? -
భారత్‌పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
దేశంలో తొలి `కారుణ్య మరణం`- తీర్పు చెబుతూ కన్నీళ్లు పెట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం












Click it and Unblock the Notifications