నేను అలాగే ఆలోచించా, కానీ తప్పు: పవన్ కళ్యాణ్ ప్రకటన, బాధపడ్డ చిరంజీవి!
జనసేన పార్టీ అధినేత, తన సోదరుడు పవన్ కళ్యాణ్ ఇటీవల చేసిన ప్రకటనపై మాజీ కేంద్రమంత్రి, కాంగ్రెస్ నేత చిరంజీవి ఫీలయ్యారని అంటున్నారు.
అమరావతి: జనసేన పార్టీ అధినేత, తన సోదరుడు పవన్ కళ్యాణ్ ఇటీవల చేసిన ప్రకటనపై మాజీ కేంద్రమంత్రి, కాంగ్రెస్ నేత చిరంజీవి ఫీలయ్యారని అంటున్నారు.

అక్టోబర్ నుంచి ప్రత్యక్ష రాజకీయాల్లోకి
అక్టోబర్ నెల నుంచి ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తానని పవన్ కళ్యాణ్ ప్రకటించిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి ఆయన సినిమాలను పక్కన పెట్టనున్నారు. వారంలో మూడు రోజులు రాజకీయాలకు సమయం కేటాయిస్తానని చెప్పారు.
Recommended Video


దీంతో చిరంజీవి ఆవేదన!
2019 ఎన్నికల నాటికి ఆయన పూర్తిగా రాజకీయాలకు పరిమితమవుతారు. అలాగే, సినిమాలకు దూరమవుతారు. తాను త్వరలో సినిమాలు తగ్గిస్తానని, ఖాళీ రోజుల్లోనే సినిమాలు చేస్తానని, అవసరమైతే సినిమాలు మానేస్తానని పవన్ కళ్యాణ్ ప్రకటించారు. ఈ ప్రకటనతో చిరంజీవి ఫీల్ అయ్యారని అంటున్నారు.

తమ్ముడుకు అన్నయ్య సలహా
ఈ మేరకు పవన్ కళ్యాణ్‌కు చిరంజీవి ఓ సలహా ఇచ్చారని కూడా ప్రచారం సాగుతోంది. రాజకీయాలు తాను కూడా చూశానని, అయితే రాజకీయాల్లో ఉండాలో, వద్దో తాను చెప్పనని, కానీ సినిమాలు మాత్రం మానుకోవద్దని తమ్ముడికి అన్నయ్య సలహా ఇచ్చినట్లు ప్రచారం సాగుతోంది.

సినిమాలు మాత్రం మానకు
రాజకీయాల పైన ఆసక్తితో సినిమాలు మాత్రం మానవద్దని చిరంజీవి హితవు పలికారని తెలుస్తోంది. తాను కూడా ఒకప్పుడు ఇలాగే ఆలోచించానని, ఇప్పుడు మాత్రం అది తప్పుగా అనిపిస్తోందని చిరంజీవి వ్యాఖ్యానించినట్లుగా ప్రచారం సాగుతోంది.












Click it and Unblock the Notifications