చిరు వర్సెస్ పవన్ కళ్యాణ్: నాగబాబు డైలమా?

హైదరాబాద్: పవన్ కళ్యాణ్ జనసేన పార్టీని స్థాపించడంతో రాష్ట్ర రాజకీయాల్లో విచిత్రమైన పరిస్థితి నెలకొంది. అన్నదమ్ములు రాజకీయ ప్రత్యర్థులుగా మారిపోయారు. సీమాంధ్రలో రాజకీయం పవన్ కళ్యాణ్ వర్సెస్ కాంగ్రెసు నేత చిరంజీవి వర్సెస్‌గా మారింది. రాజకీయంగా తమ్ముడిని ఎదుర్కోవడానికి అన్నయ్య చిరంజీవి, అన్నయ్యను ఎదుర్కోవడానికి తమ్ముడు పవన్ కళ్యాణ్ మానసికంగా సిద్దమైనట్లే కనిపిస్తున్నారు.

కాంగ్రెసుకు జాతీయ స్థాయిలో ప్రత్యర్థి అయిన బిజెపిపై, దానితో పొత్తు పెట్టుకోబోతున్న తెలుగుదేశం పార్టీని చిరంజీవి ఇప్పటికే తూర్పార పడుతున్నారు. ఇదే సమయంలో కాంగ్రెసుపై పవన్ కళ్యాణ్ మాటల ఈటెలు విసిరారు. ఈ నెల 27వ తేదీన మరోసారి కాంగ్రెసుపై సమరం ప్రకటించబోతున్నారు. ఈ స్థితిలో వారి సోదరుడు నాగబాబు తీవ్రమైన మానసిక సంకటంలో పడిపోయినట్లు చెబుతున్నారు.

Chiranjeevi vs Pawan Kalyan: Nagababu nutral

నిజానికి, నాగబాబు ఈ ఎన్నికల్లో ప్రవేశించి, ఓ జాతీయ పార్టీ తరఫున కాకినాడ లోకసభ స్థానం నుంచి పోటీ చేయాలని భావించారని చెబుతారు. బహుశా, బిజెపి నుంచి కావచ్చునని అంటారు. అయితే, ఈలోగా పవన్ కళ్యాణ్ జనసేన పార్టీని స్థాపించడంతో ఆయన వెనక్కి తగ్గాల్సి వచ్చిందని అంటున్నారు. పవన్ కళ్యాణ్ పార్టీని స్థాపించబోతున్న నేపథ్యంలో నాగబాబుతో చిరంజీవి మాట్లాడినట్లు సమాచారం. దాంతో నాగబాబు పవన్ కళ్యాణ్‌కు వ్యతిరేకంగా ప్రకటన చేయాల్సి వచ్చిందని చెబుతున్నారు.

మెగా అభిమానులంతా అన్నయ్యవైపే ఉంటారని ఆయన చిరంజీవికి మద్దతు ప్రకటించారు. దీంతో మెగా కుటుంబంలో పవన్ కళ్యాణ్‌కు మద్దతు లేకుండా పోయింది. అయినా వెనక్కి తగ్గకుండా పవన్ కల్యాణ్ జనసేన పార్టీని స్థాపించారు. బిజెపితోనూ తెలుగుదేశం పార్టీతోనూ పొత్తు పెట్టుకోవడానికి సిద్దపడ్డారు. దీంతో నాగబాబు తటస్థంగా ఉండాలని, రాజకీయాల జోలికి రావద్దని నిర్ణయించుకున్నట్లు చెబుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+