రాజ్యసభకు మెగాస్టార్..కూతురు సుస్మిత రియాక్షన్
మెగాస్టార్ చిరంజీవి తిరిగి రాజకీయాల్లోకి రీఎంట్రీ ఇవ్వాలని భావిస్తున్నారా అంటే అవుననే అంటున్నాయి సినీ వర్గాలు. తమ్ముడు పవన్ కల్యాణ్ జనసేన స్థాపించి తొలిసారి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. పార్టీ స్థాపించిన పదేళ్ల తర్వాత చట్ట సభల్లో అడుగుపెట్టబోతున్నారాయన. 2019 ఎన్నికల్లో పోటీ చేసిన రెండు స్థానాల్లో ఘోరంగా ఓడిపోయిన పవన్ కల్యాణ్ , ఇటీవల జరిగిన ఎన్నికల్లో పిఠాపురం నుంచి టీడీపీ సహాకారంతో ఎమ్మెల్యేగా విజయం సాధించారు. తొలిసారి ఎమ్మెల్యే కావడంతో పాటు డిప్యూటి సీఎం పదవి కూడా దక్కడంతో మెగా కుటుంబంలో సంబరాలు అంబరాన్ని తాకాయి.
ఇదే సమయంలో చిరంజీవి సైతం తిరిగి రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తారనే వాదన తెర మీదకు వస్తోంది. ఆయన బీజేపీ తరుఫున రాజ్యసభకు వెళ్లే అవకాశాలున్నాయనే ప్రచారం జరుగుతోంది. పవన్ కల్యాణ్ బీజేపీతో పొత్తులో ఉన్నారు కాబట్టి.. ఆ పార్టీ తరుఫున చిరంజీవికి రాజ్యసభ కేటాయించే విధంగా చర్చలు సాగినట్టు తెలుస్తోంది. అయితే గతంలో కాంగ్రెస్ పార్టీలో ఉన్న చిరంజీవికి బీజేపీ రాజ్యసభ ఇస్తుందా అనే ప్రశ్న ఉత్పన్నం అవుతోంది. చిరంజీవి 2009లో ప్రజారాజ్యం పేరిట రాజకీయ పార్టీని స్థాపించారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ఆర్ చరిష్మా ముందు చిరంజీవి సినీ గ్లామర్ ఏమాత్రం పని చేయలేదు.

దీంతో చిరంజీవి కేవలం 18 సీట్లలో మాత్రమే విజయం సాధించగలిగారు. ఆ తర్వాత తన పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేసి కేంద్రమంత్రి అయ్యారాయన. 2014 ఎన్నికల్లో కాంగ్రెస్ ఓడిపోవడంతో రాజకీయాలకు గుడ్ బై చెప్పి సినిమాలు చేస్తున్నారు. అయితే ఆయన కాంగ్రెస్‌లోనే ఉన్నారా లేదా అనే విషయంలో ఇప్పటి వరకు స్పష్టత లేదు. ప్రస్తుతం పవన్ కల్యాణ్ ఏపీ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించడంతో మరోసారి చిరంజీవి పేరు తెర మీదకు వచ్చింది. ఆయనకు రాజ్యసభ పదవి ఖాయమంటూ ప్రచారం జరుగుతోంది. తాజాగా దీనిపై చిరంజీవి కూతురు సుస్మిత స్పందించారు.
చిరంజీవి రాజ్యసభకు వెళ్తున్నారంటూ వార్తలొస్తున్నాయి..ఇందులో ఎంతవరకు వాస్తవం ఉందనే ప్రశ్న సుస్మితకు ఎదురయింది.ఈ ప్రశ్నకు సుస్మిత సమాధానం చెబుతూ.దాని గురించి నాకు ఎలాంటి విషయాలు తెలియవని తెలిపారు. మా కుటుంబం గురించి చాలా విషయాల గురించి వదంతుల గురించి చర్చలు జరుగుతుంటాయి.రెండు రోజుల క్రితం పవన్ బాబాయ్ ప్రమాణ స్వీకారం చేశారు. ప్రస్తుతం మా ఇంట్లో అందరూ కూడా ఇదే విషయం గురించి చర్చించుకుంటున్నామని ఆమె తెలిపారు. దీంతో చిరంజీవికి రాజ్యసభ సీటు విషయంలో మెగా కుటుంబంలో ఎటువంటి చర్చ జరగలేదనే విధంగా సుస్మిత జావాబిచ్చినట్టు అయింది.
-
అమరావతి పై కేంద్రం భారీ శుభవార్త, కొత్త చరిత్ర..!! -
Tamil Nadu Election Survey: పవన్ ఫీట్ రిపీట్ చేస్తున్న విజయ్ ? తేల్చేసిన తాజా సర్వే..! -
పెళ్లికి రెడీ అయిన యంగ్ కపుల్.. -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
మళ్లీ మొదలెట్టావా పాప.. ప్రెగ్నెన్సీ నిజమేనా? -
Tamil Nadu Survey: తమిళనాడు పోరు ఏకపక్షమే- తేల్చేసిన లోక్ పోల్ సర్వే..! -
విజయ్ దేవరకొండపై ఆ స్టార్ హీరో భార్య సీక్రెట్ లవ్.. పెళ్లయినా ఆగని..! -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
తాజా కోడిగుడ్డును గుర్తుపట్టడం ఇక ఈజీ -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
వేసవి సెలవుల షెడ్యూల్ లో కీలక మార్పులు, తాజా ఉత్తర్వులు..!!












Click it and Unblock the Notifications