హనుమ జయంతి వేళ చిరంజీవి ఇంట్లో అరుదైన అపురూప దృశ్యం..!!

హనుమాన్ జయంతి సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి తన నివాసంలో అద్భుతమైన దృశ్యం చోటు చేసుకుంది. ఈ విషయాన్ని చిరంజీవి స్వయంగా పంచుకున్నారు. తన పూజా మందిరం లోని హనుమంతుడి విగ్రహంపై సూర్యకిరణాలు సప్త వర్ణాలుగా మారి నేరుగా స్పృశిస్తున్న వీడియోను షేర్ చేశారు. ఇది తన పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఇప్పుడు ఫ్యాన్స్ ఇది చిరంజీవి భక్తికి నిదర్శనంగా చోటు చేసుకున్న అద్భుతంగా భావిస్తున్నారు. ఈ వ్యవహారం ఇప్పుడు వైరల్ అవుతోంది.

హానుమాన్ భక్తుడు అయిన చిరంజీవి హనుమాన్ జయంతి వేళ ఆసక్తి కర అంశాన్ని తన అభిమానులతో పంచుకున్నారు. మెగాస్టార్‌ పూజా మందిరంలో చోటుచేసుకొన్న ఓ అపురూప దృశ్యం గురించి ఆయన వీడియోలో చూపించారు. 'మనకు నిత్యం కనిపించే ప్రత్యక్ష దైవం ఆ సూర్యభగవానుడి కిరణాలు మా ఇలవేల్పు హనుమంతుడిని స్పృశిస్తున్న అద్భుతమైన సన్నివేశాలు మీతో పంచుకుంటున్నాను' అని చిరంజీవి ఓ వీడియోను ఎక్స్‌ వేదికగా పోస్ట్‌ చేశారు.

chiranjeevi-witnesses-heavenly-sunbeam-on-hanuman-jayanti-fans-call-it-a-miracle-here-the-detail

ప్రతి సంవత్సరం డిసెంబర్‌, జనవరి, ఫిబ్రవరి నెలల్లో సూర్యకిరణాలు సప్త వర్ణాలుగా మారి మా పూజా మందిరంలో ఉన్న హనుమంతుడిని పై నుంచి కింది వరకూ స్పృశిస్తూ ప్రసరించడం చూస్తుంటే ఆ అనుభూతిని మాటల్లో చెప్పలేను. ఇటీవల మనం అయోధ్యలో బాలరాముడి నుదిటిపై సూర్యకాంతి పడి మెరిసిన అద్భుతాన్ని చూశాం. అలాగే కోణార్క్‌, అరసవల్లి దేవాలయాల్లో కూడా సూర్య కిరణాలు భగవంతుడిని తాకే విశేషం అందరికీ తెలిసిందేనని వివరించారు.

ఆంజనేయుడి భక్తుడు చిరంజీవి

అలాంటి దైవానుభూతి మా ఇంట్లోనూ ఆంజనేయుడిని స్పృశించడం నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నా. అందరికీ హనుమాన్‌ జయంతి శుభాకాంక్షలు' అని పేర్కొన్నారు. చిరంజీవి తొలి నుంచి ఆంజనేయ స్వామి భక్తుడిగా ఉంటున్నారు. చిరంజీవితో పాటుగా తనయుడు రాం చరణ్ సైతం హనుమ దీక్ష పలు మార్లు తీసుకున్నారు. తొలి నుంచి చిరంజీవి కుటుంబం ఆంజనేయ స్వామి భక్తులుగా పలు భక్తి కార్యక్రమాలు నిర్వహించారు. డిప్యూటీ సీఎం పవన్ సైతం ఆంజనేయుడిని ఎక్కువగా ఆరాధిస్తారు.

ఇక, ఇప్పుడు చిరంజీవి నివాసంలో చోటు చేసురున్న అరుదైన అద్బుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మెగా ఫ్యాన్స్ ఈ వీడియో ను భారీగా షేర్ చేస్తున్నారు. చిరంజీవి హనుమంతుడు మీద ఉన్న భక్తికి.. ఇదొక మిరాకిల్ గా అభివర్ణిస్తున్నారు. చిరంజీవి ఇంట చోటు చేసుకున్న ఈ ఆవిష్కరణ గురించి అటు సోషల్ మీడియా తో పాటుగా సినీ సర్కిల్స్ లోనూ పెద్ద ఎత్తున చర్చగా మారింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+