విప్లవ వీరుడు ఉయ్యాలవాడ నర్సింహారెడ్డిగా చిరు?

హైదరాబాద్: కాంగ్రెసు నాయకుడు, మెగాస్టార్ చిరంజీవికి తన 150వ సినిమా చేయడానికి ఉన్న అడ్డంకులన్నీ తొలగిపోయాయి. కాంగ్రెసు అధికారం కోల్పోవడంతో మంత్రిగా పనిచేసే అవకాశం కూడా లేదు. ఆయన రాజ్యసభ సభ్యుడిగా కొనసాగుతున్నారు. మంత్రిగా ఉన్నన్ని రోజులు సినిమాలపై దృష్టి పెట్టే అవకాశం చిరంజీవికి రాలేదు.

ఆగస్టు 22 చిరంజీవి జన్మదినం. ఆ సందర్భంగా ఆయన 150వ చిత్రం ప్రారంభమవుతుందని వార్తలు వస్తున్నాయి. ఆయన 150వ చిత్రం ఓ విప్లవ వీరుడి చరిత్ర కావడం విశేషం. ఆయన ఉయ్యాలవాడ నర్సింహారెడ్డిగా నటిస్తారని సమాచారం.

Chiru may act in revolutionary hero role

రాయలసీమకు చెందిన విప్లవ వీరుడు ఉయ్యాలవాడ నర్సింహారెడ్డి సూర్యుడు అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యంపై పోరాటం చేశాడు. 150వ సినిమా చేస్తే సామాజిక నేపథ్యం ఉన్న కథనే ఎంచుకుంటానని, అందులో వినోదం కూడా ఉంటుందని చిరంజీవి మొదటి నుంచీ చెబుతూ వస్తున్నారు.

గత రెండేళ్ల నుంచి పరచూరి బ్రదర్స్ ఉయ్యాలవాడ నర్సింహారెడ్డి కథకు స్క్రిప్టు తయారు చేస్తున్నట్లు సమాచారం. ఈ చిత్రానికి వివి వినాయక్ దర్శకత్వం వహిస్తారు త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించిన వివరాలు తెలుస్తాయని చిరు సన్నిహితులు ఊరిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+