అమెరికాలో ఆంధ్ర విద్యార్థి అదృశ్యం: వారం రోజులుగా గల్లంతు
విజయవాడ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని చిత్తూరు జిల్లాకు చెందిన విద్యార్థి అమెరికాలో కనిపించకుండా పోయాడు. అమెరికాలోని కాలిఫోర్నియాలో గల ఫుల్లెర్టోన్‌లో ఎంఎస్ చేస్తున్న అతను వారం రోజులుగా కనిపించడం లేదు.
23 ఏళ్ల ప్రవీణ్ గల్లా కోసం మిత్రులు, బంధువులు, పోలీసులు గాలిస్తున్నారు. విద్యాపరమైన సమస్యల వల్ల ప్రవీణ్ డిప్రెషన్‌కు గురైనట్లు పోలీసులు చెబుతున్నారు. ప్రవీణ్ కోసం గాలింపును ముమ్మరం చేయాలని శాన్‌ఫ్రాన్సిస్కోలోని భారత కాన్సులేట్ జనరల్ ఫుల్లెర్టోన్ విశ్వవిద్యాలయం పోలీసులను, స్థానిక అధికారులను కోరారు.

ప్రవీణ్ గాలించడానికి చర్యలు తీసుకోవాల్సిందిగా అతని మిత్రుడు ఎం. కోరె, తదితరులు భారత విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్‌ను కోరారు. ప్రవీణ్ భువనేశ్వర్‌లో గీతం విశ్వవిద్యాలయంలో చేరారు. అతని స్వస్థలం తిరుపతి. అతని తండ్రి గల్లా నాగేశ్వర రావు ఐరాల మండలం నెల్లిమర్లకు చెందినవాడు. అయితే, తిరుపతిలో స్థిరపడ్డాడు.
ఫిబ్రవరి 1వ తేదీ నుంచి ప్రవీణ్ జాడ తెలియడం లేదు. ఫుల్లెర్టోన్ పోలీసులు లుక్ ఔట్ నోటీసు జారీ చేశారు. పోలీసులు గల్లా ప్రవీణ్ కోసం తీవ్రంగా గాలింపు జరుపుతున్నారని కోరె డక్కన్ క్రానికల్ ప్రతినిధితో చెప్పారు.












Click it and Unblock the Notifications