శ్రీవారి మెట్ల మార్గంలో షాక్, లవర్స్ ఏం చేశారంటే ?, గతంలో యువతికి !
తిరుమలలో శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడానికి ప్రతిరోజు కొన్ని వేలమంది శ్రీవారి భక్తులు తిరుపతిలోని అలిపిరి నుండి నడక మార్గంలో తిరుమలకు చేరుకొని స్వామివారికి మొక్కులు చెల్లించుకుంటారు. అలాగే తిరుమల నుండి తిరుపతిలోని అలిపిరి వరకు కొన్ని వేలమంది నడక మార్గంలో ఏడుకొండలు దిగి వాళ్ల మొక్కులు చెల్లించుకుంటున్నారు.
ఇలా ప్రతిరోజు అలిపిరి- తిరుమల కాలి నడక మార్గంలో నిత్యం శ్రీవారి భక్తులతో రద్దీగా ఉంటుంది. తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్రతో సహ దేశంలో ఇతర రాష్ట్రాలకు చెందిన శ్రీవారి భక్తులు అలిపిరి నుండి తిరుమలకు కాలినడక మార్గంలో చేరుకుంటున్నారు. ఇటీవల సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా ఆయన కుటుంబ సభ్యులతో కలిసి అలిపిరి నుండి కాలి నడక మార్గంలో తిరుమల చేరుకుని శ్రీవారికి మొక్కులు చెల్లించుకున్నారు.

శ్రీవారి భక్తులతో కలిసి శ్రీవారి మెట్ల మార్గంలో తిరుమలకు బయలుదేరిన ప్రేమ జంట ఆత్మహత్యాయత్నం చేయడంతో కలి నడక మార్గంలో వెలుతున్న శ్రీవారి భక్తులు హడలిపోయారు. అలిపిరి నుండి తిరుమలకు వెళ్లే నడక మార్గంలోని 450 మెట్ల వద్ద ప్రేమ జంట పురుగుల మందు తాగేసింది. విషయం గుర్తించిన శ్రీవారి భక్తులు వెంటనే టీటీడీ సెక్యూరిటీ సిబ్బందికి సమాచారం అందించారు. టీటీడీ సెక్యూరిటీ సిబ్బంది వెంటనే ఆ ప్రేమ జంటను 108 వాహనంలో తిరుపతిలోని రుయా ఆసుపత్రికి తరలించారు.

పురుగుల మందు తాగేసిన ప్రియుడు సతీష్ పరిస్థితి విషయంగా ఉందని పోలీసులు అంటున్నారు. చిత్తూరు జిల్లాలోని బంగారురెడ్డి పల్లెకు చెందిన ప్రేమికులు రాధిక, సతీష్ పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశారని పోలీసుల విచారణలో వెలుగు చూసింది. గతంలో ప్రియురాలు రాధికకు వేరే వ్యక్తితో వివాహమైందని, ఆమె భర్తకు దూరంగా ఉంటుందని పోలీసులు అన్నారు.
ఇప్పటికే వివాహమైన రాధికను ప్రేమించిన సతీష్ పురుగుల మందు తాగడంతో అతని పరిస్థితి విషమంగా ఉందని, కేసు దర్యాప్తులో ఉందని పోలీసులు తెలిపారు. తిరుమల మెట్ల మార్గంలో వెలుతున్న భక్తులను టీటీడీ సెక్యూరిటీ సిబ్బంది క్షుణంగా పరిశీలించి తరువాత తిరుమల కొండ మీదకు పంపిస్తుంటారు. అలాంటిది ప్రేమ జంట పురుగుల మందు బాటిల్ తీసుకుని కాలి నడకన మెట్ల మార్గంలోకి ఎలా వచ్చారు అని శ్రీవారి భక్తులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.












Click it and Unblock the Notifications