పెళ్లి పీటలెక్కాల్సిన చిత్తూరు లేడీ టెక్కీ.. అమెరికాలో ఆత్మహత్య: వరుడిపై ఫిర్యాదు
డల్లాస్/చిత్తూరు: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని చిత్తూరుకు చెందిన ఓ యువతి అమెరికాలో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. గురువారం(మార్చి 4న) ఆమెకు వివాహం జరగాల్సి ఉండగా.. ఆమో బలవన్మరణానికి పాల్పడటంతో కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
చిత్తూరు పోలీసుకాలనీకి చెందిన సుష్మా అనే బాధితురాలు అమెరికాలోని డల్లాస్‌లో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తోంది. ఇటీవల ఆమెకు భరత్ అనే యువకుడితో నిశ్చితార్థం జరిగింది. మార్చి 4న పెళ్లి నిశ్చయించుకున్నారు.

అయితే, కొద్ది రోజుల క్రితం ఈ వివాహం రద్దు చేసుకుంటున్నట్లు యువకుడు, అతడి తరపు కుటుంబసభ్యులు సుష్మ కుటుంబసభ్యులకు తెలిపారు. ఈ నేపథ్యంలో తీవ్ర మనస్తాపానికి గురైన సుష్మా గురువారం ఆత్మహత్యకు పాల్పడింది.
పెళ్లి పీటలెక్కాల్సిన తమ కూతురు ఇలా అర్ధాంతరంగా బలవన్మరణానికి పాల్పడటంతో సుష్మ తల్లిదండ్రులు, కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. సుష్మ ఆత్మహత్యకు కారణమైన భరత్‌పై ఆమె కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.












Click it and Unblock the Notifications