చిత్తురు మేయర్ అభ్యర్థి హేమలత, వారికి బాబు ఓకే: అనురాధ బంధువే..
చిత్తూరు మేయర్ అభ్యర్థిగా హేమలత పేరును ఖరారు చేశారు. హేమలత పేరును ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గురువారం ప్రకటించారు.
చిత్తూరు: చిత్తూరు మేయర్ అభ్యర్థిగా హేమలత పేరును ఖరారు చేశారు. హేమలత పేరును ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గురువారం ప్రకటించారు.
హేమలత కఠారి అనురాధ బంధువు. చిత్తూరు మేయర్ పదవికి ఈ నెల 15న ఎన్నిక జరగనుంది. ఉప ఎన్నికల్లో గెలిచిన కార్పొరేటర్లను చంద్రబాబు అభినందించారు.
చిత్తూరు ఎమ్మెల్యే డీకే సత్యప్రభ, ఎమ్మెల్సీ రాజసింహులు, టిడిపి జిల్లా ప్రధాన కార్యదర్శి పులివర్తి నానిల ఆధ్వర్యంలో ఇటీవల గెలుపొందిన కార్పొరేటర్లు హేమలత, చెరుకూరి వసంత కుమార్‌లతో సహా మరో పది మంది కార్పొరేటర్లు సచివాలయంలో చంద్రబాబును కలిశారు.

గతంలో మేయర్ కటారి అనురాధ హత్యకు గురికావడంతో ఆ స్థానం నుంచి సమీప బంధువైన హేమలత ఏకగ్రీవంగా గెలుపొందారు. ఏప్రిల్ 15న చిత్తూరు కార్పొరేషన్ మేయర్ ఎన్నికలో హేమలత అభ్యర్థిత్వాన్ని ఎంపిక చేయాలన్న కార్పొరేటర్ల విజ్ఞప్తిని ముఖ్యమంత్రి ఆమోదించారు.
చిత్తూరులో 50 మంది మమున్సిపల్ కౌన్సిలర్లు ఉన్నారు. ఇందులో 38 మంది కార్పోరేటర్లు తెలుగుదేశం పార్టీకి చెందిన వారే. తాజాగా గెలిచిన హేమలత, వసంత్ కుమార్‌తో కలిపి 38 మంది.
హేమలత, తన భర్త ప్రవీణ్‌తో కలిసి ఇటీవల ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డిని కలిశారు. అమర్నాథ్ రెడ్డి 2014లో వైసిపి నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. ఆ తర్వాత టిడిపిలో చేరి, ఇటీవలే మంత్రి అయ్యారు.
ఆ సమయంలోనే అమర్నాథ్ రెడ్డి వారికి చెప్పారు. ముఖ్యమంత్రి చంద్రబాబు మీకే మేయర్ పోస్ట్ ఇస్తారని చెప్పారు. మేయర్ పోస్ట్ ఏకగ్రీవం చేసేందుకు అమర్నాథ్ రెడ్డి తనవంతు ప్రయత్నాలు చేశారు.
-
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా -
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, పథకాలు ఇక నుంచి..!! -
సమ్మర్ లో ఈ హిల్ స్టేషన్ కు వెళ్తే.. మళ్లీ తిరిగి రావాలనిపించదు..! -
US Blockade: అమెరికాకు బిగ్ షాక్..! తేలిపోయిన హార్ముజ్ దిగ్బంధం..! -
జగన్, షర్మిల సహా వారికి చంద్రబాబు లేఖ - కీలక విజ్ఞప్తి..!!












Click it and Unblock the Notifications