మోడీ బ్యాడ్ బాయ్.. దేవాన్ష్, నేనూ కొట్టేత్తాం, పెన్సిల్తో గీకేస్తాం.: శివప్రసాద్
న్యూఢిల్లీ: చిత్తూరు ఎంపీ శివప్రసాద్ మంగళవారం మరో వేషంలో పార్లమెంటుకు వచ్చారు. ఈసారి స్కూలుకు వెళ్లే విద్యార్థి వేషంలో వచ్చి పార్లమెంటు ఆవరణలో హడావుడి చేశారు. చిన్న పిల్లల తరహాలో మాట్లాడుతూ ప్రధాని మోడీకి చురకలంటించారు.
తలకు స్కూల్ బ్యాగ్, ఓ చేతిలో పుస్తకాలు, మరో చేతిలో పెన్సిల్ తో ఉన్న శివప్రసాద్ వేషాన్ని చాలామంది ఆసక్తిగా తిలకించారు. ఈ సందర్భంగా శివప్రసాద్.. 'మోడీని కొట్టేత్తాం.. మోడీ ఒక బ్యాడ్ బాయ్. చంద్రబాబు తాత మా ఫ్యూచర్ కోసం కష్టపడుతుంటే, ఫండ్స్ ఇవ్వరా? స్టేటస్ ఇవ్వరా? ఏమీ ఇవ్వకపోతే ఎట్టమ్మా? ఎట్టా డెవలప్ అయ్యేది? మా ఫ్యూచర్ ఎట్లా?.' అంటూ ప్రశ్నించారు.

'దేవాన్ష్.. మేమూ ఒక టీమ్. స్టేటస్ ఇవ్వకపోతే స్కేలుతో కొట్టేస్తాం.. పెన్సిల్ తో ముఖమంతా గీకేస్తాం.. ఏమనుకుంటున్నారూ... అన్నీ ఇవ్వాల్సిందే ఏపీకి' అంటూ వ్యాఖ్యానించారు. ఐదో క్లాసు, ఆరో క్లాసు చదువుతున్న విద్యార్థులు కూడా మోడీని చూస్తే అసహ్యించుకుంటున్నారని అన్నారు. ఇప్పటికైనా రాష్ట్ర పరిస్థితిని అర్థం చేసుకుని మోడీ ప్రత్యేక మోదా కల్పించాలని అన్నారు.
-
విద్యా సంస్థలకు రేపు రెండో శనివారం సెలవు రద్దు, ఒంటి పూట బడులపై తాజా నిర్ణయం..!! -
ఈ నెల 15 నుంచి అశుభ దినాలు ప్రారంభం- చేయకూడని కార్యక్రమాలు -
పవన్ కళ్యాణ్ కొత్త మూవీలో "రౌడీ హీరో".. బాక్సాఫీస్ షేక్ పక్కా !! -
ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో వండిన అన్నం తింటున్నారా- ఇది తెలుసుకోవాల్సిందే..!! -
కోటి 15 లక్షల మంది మహిళలకు రేవంత్ రెడ్డి వరాలు -
ఎల్లుండే.. `ఉస్తాద్..` ఫ్యాన్స్ కు పండగ -
మంత్రులు సిద్దంగా ఉండాలి, ముహూర్తం ఫిక్స్ - తేల్చి చెప్పిన చంద్రబాబు..!! -
భారత్ లో గ్యాస్ కొరతపై ఐదు నెలల ముందే చెప్పిన జ్యోతిష్యుడు ప్రశాంత్ కిని -
పెట్రోల్, డీజిల్ ధరల బాంబు- కమింగ్ సూన్ -
ఇరాన్ సుప్రీం లీడర్ కు నో లైఫ్ గ్యారెంటీ- మట్టుబెట్టడం తథ్యం: నెతన్యాహు శపథం -
బీజేపీతో విజయ్ పొత్తు? తమిళ రాజకీయాల్లో ఊహించని ట్విస్ట్! -
ఉస్తాద్ భగత్ సింగ్ నిర్మాతలకు బిగ్ రిలీఫ్- ఏకంగా సుప్రీంకోర్టు స్టే












Click it and Unblock the Notifications