25 కోట్ల లావాదేవీలు: మోడల్ కోసం కోల్‌కతాలో గాలింపు

చిత్తూరు: ఎర్రచందనం స్మగ్లర్‌గా మారిన మోడల్ సంగీతా ఛటర్జీ కోసం చిత్తూరు పోలీసులు పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్‌కతాలో గాలింపు చర్యలు చేపట్టారు. తమ ముందు హాజరు కాకపోవడంతో చిత్తూరు కోర్టు ఆమెపై అరెస్టు వారంట్ జారీ చేసింది. దీంతో పోలీసులు ఆ గాలింపు చర్యలు చేపట్టారు.

రెండేళ్లలో సంగీత ఛటర్జీ 25 కోట్ల లావాదేవీలు నడిపినట్లు చెబుతున్నారు. ఆమె నుంచి ఇది వరకే పోలీసులు రెండున్నర కిలోల బంగారం, విలువైన పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. లేడీ డాన్ ఛటర్జీ పోలీసుల కళ్లు గప్పి సంచరిస్తున్నట్లు సమాచారం.

ఎర్ర చందనం స్మగ్లర్ లక్ష్మణ్ ఐదేళ్ల క్రితం సంగీతను రెండో పెళ్లి చేసుకున్నా డు. విలాసవంతమైన జీవనం సంగీత ప్రపంచం. కోల్‌కతాలో ఎయిర్‌హోస్ట్‌గా పనిచేసేప్పుడు పలువురు అంతర్జాతీ య స్మగ్లర్లతో ఈమెకు పరిచయాలు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. కొద్దిరోజుల తరువాత మోడల్‌గా రాణించి పలు యాడ్స్‌లో కూడా నటించింది.

 Chitttoor police search for model Sangeetha in Kolkatta

ఇదిలావుంటే, చిత్తూరు జిల్లా తిరుపతి గ్రామీణ మండలం లక్ష్మీచెరువు సమీపంలో ఎర్రచందనం దుంగలను అక్రమంగా తరలిస్తున్న వారిపై ఎం.ఆర్‌.పల్లి పోలీసులు దాడి చేసి ఇద్దరు నిందితులను పట్టుకున్నారు. లక్ష్మీచెరువు ప్రాంతంలో ఎర్రచందనం దుంగలను అక్రమంగా తరలిస్తున్నట్లు వచ్చిన సమాచారం అందింది. దీంతో గురువారం ఉదయం 7.30 సమయంలో ఆ ప్రాంతంలో గాలింపు చేపట్టారు.

ఈ దాడిలో తమిళనాడు, తిరువణ్ణామలైకు చెందిన చిన్నస్వామి రాజేంద్రన్‌ అలియాస్‌ రాకీ, వేలుముత్తు గంగరాజులు పట్టుబడ్డారు. వీరి వద్ద నుంచి ఐదు ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు. ఎర్రచందనం దుంగలను తరలించేందుకు వేచిచూస్తున్నట్లు నిందితులు పోలీసులకు తెలపడంతో కొంతసేపు ఆ ప్రాంతంలో పోలీసులు నిరీక్షించారు. అయితే నిందితులు ముందుగానే సమాచారం అందుకుని పారిపోయారు. అనంతరం నిందితులను దుంగలతోపాటు స్టేషన్‌కు తరలించి కేసు నమోదు చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+