జెత్వానీ కేసులో కీలక పరిణామాలు - చార్జిషీటు వెనక్కి..!!

సంచలనంగా మారిన ముంబాయి మోడల్ కాదంబరి జెత్వానీ కేసులో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. వైసీపీ హయాంలో అప్పటి పోలీసు అధికారులు తనను నిర్బంధించి చిత్ర హింసలు పెట్టారని కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత జెత్వానీ ఆరోపించారు. ఇదే అంశం పైన చేసిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు అయింది. ఈ వ్యవహారంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న పోలీసు అధికారులను సస్పెండ్ చేసారు. కాగా, ఇప్పుడు ఈ కేసులో సీఐడీ దాఖలు చేసిన ఛార్జ్ షీట్ రిటర్న్ కావటంతో.. మరో అభియోగ పత్రాన్ని అధికారులు కోర్టుకు సమర్పించనున్నారు.

కాదంబరి జెత్వానీ కేసులో తాజాగా కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో సీఐడీ దాఖలు చేసిన ఛార్జ్ షీట్ రిటర్న్ అయింది. ఈ కేసులో సీఐడీ అధికారులు తాజాగా విజయవాడ నాలుగో అదనపు జ్యూడీషియల్ ఫస్ట్‌క్లాస్‌ మేజిస్ట్రేట్‌ కోర్టులో చార్జిషీటు దాఖలు చేశారు. అయితే, ఈ ఛార్జ్ షీటును కోర్టు రిటర్న్ చేసింది. ఈ కేసు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తొలి నాళ్లల్లో సంచలనంగా మారింది. వైసీపీ హయాంలో అప్పట్లో కొందరు పోలీసు అధికారులు తనతో పాటుగా తన కుటుంబ సభ్యులను అన్యాయంగా అరెస్ట్ చేసి చిత్రహింసలు పెట్టారని జెత్వానీ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత ఆరోపిస్తూ.. విజయవాడ పోలీసు కమిషనర్ కు ఫిర్యాదు చేసారు. ఈ మేరకు ఇబ్రహీంపట్నం పోలీసు స్టేషన్‌లో ఐపీసీ 120బీ, 166, 166ఏ, 167, 342, 354డీ, 420, 467, 469, 471, 34 సెక్షన్ల కింద కేసు 'క్రైం నంబరు 469/2024) నమోదైంది.

cid-decided-to-file-fresh-charge-sheet-in-kadambari-jethwani-case-soon-after-court-returns-earlier

మరో ఛార్జ్ షీట్ దాఖలుకు సమాయత్తం

ఈ కేసులో వైపీపీ నేతలు సహా పోలీసుల అధికారులను నిందితులుగా చేర్చారు. వైసీపీ నేత కుక్కల విద్యాసాగర్‌(ఏ1), నిఘా విభాగం మాజీ చీఫ్‌ పీఎ్‌సఆర్‌ ఆంజనేయులు (ఏ2), పోలీసు అధికారులు కాంతిరాణా తాతా (ఏ3), కె.హనుమంతరావు (ఏ4), ముత్యాల సత్యనారాయణ (ఏ5), విశాల్‌గున్నీ(ఏ6)తో పాటు ప్రకాశం జిల్లాకు చెందిన న్యాయవాదిని నిందితులుగా చేర్చారు. పీఎస్ఆర్‌ ఆంజనేయులు, కాంతిరాణా, విశాల్‌గున్నీ, అప్పటి పశ్చిమ మండలం ఏసీపీ కె.హనుమంతరావు, ఇబ్రహీంపట్నం ఇన్‌స్పెక్టర్‌ సత్యనారాయణను సస్పెండ్ చేసారు. కాగా, ఆ తరువాత ప్రభుత్వం దీనిని సీఐడీకి బదిలీ చేసింది. సీఐడీ గుంటూరు ప్రాంతీయ విభాగాధికారులు దర్యాప్తు చేశారు. కేసులో ఎవరెవరు ఎలాంటి పాత్ర పోషించారో వివరిస్తూ చార్జిషీటు సిద్దం చేసారు. కాగా.. కోర్టు దీనిని రిటర్న్‌ చేయడంతో త్వరలోనే మరో చార్జిషీటు దాఖలు చేసేందుకు సీఐడీ అధికారులు సిద్దం అవుతున్నట్లు సమాచారం.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+