చంద్రబాబు పై సీఐడీ కేసుల్లో కీలక పరిణామం..!!

ఏపీలో ఎన్నికల వేళ చంద్రబాబు కేసుల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఏపీ ఫైబర్ నెట్ స్కామ్ కు సంబంధించి ఏసీబీ కోర్టులో చార్జ్ షీట్ దాఖలు చేసింది ఏపీ సీఐడీ. అందులో A 1 గా చంద్రబాబు నాయుడు, A 2గా వేమూరి హరి కృష్ణ, A 3గా కోగంటి సాంబ శివ రావులను చేర్చింది. మొత్తం ప్రాజెక్ట్ వ్యయం రూ. 330 కోట్లు కాగా రూ. 114 కోట్లు చంద్రబాబు కారణంగా నష్టం వాటిల్లిందని ఆరోపించారు. చంద్రబాబు కనుసన్నల్లోనే ఫైబర్ నెట్ స్కాం జరిగిందని ఏపీ సీఐడీ చార్జ్ షీట్లో పేర్కొంది.

చంద్రబాబును సీఐడీ కేసులు వెంటాడుతున్నాయి. మొత్తం రూ.2 వేల కోట్ల ఈ ప్రాజెక్టు కింద మొదటి దశలో రూ.333 కోట్ల విలువైన పనుల్లో అక్రమాలను సీఐడీ ప్రత్యేక దర్యాప్తు బృందం పేర్కొంది. నిబంధనలకు విరుద్ధంగా చంద్రబాబు, లోకేశ్‌కు సన్నిహితుడైన వేమూరి హరికృష్ణకు చెందిన "టెరా సాఫ్ట్‌' కంపెనీకి టెండర్లు కట్టబెట్టారని అభియోగాలు నమోదు చేసింది. ఈ మేరకు సీఐడీ.. ఏసీబీ కోర్టులో చార్జ్‌షీట్‌ దాఖలు చేసింది. చంద్రబాబు కనుసన్నల్లోనే ఫైబర్ నెట్ స్కాం జరిగిందని ఏపీ సీఐడీ చార్జ్ షీట్లో వివరిచింది.

CID Files Chargesheet in Fibernet Scam in ACB Court , Chandra Babu as A1

వేమూరి హరి కృష్ణని నిబంధనలకు విరుద్దంగా ఫైబర్ నెట్ కార్పొరేషన్ డైరెక్టర్‎గా నియమించారని తెలిపింది. ఉద్దేశ పూర్వకంగానే చంద్రబాబు.. హరి కృష్ణని నియమించారని తెలిపింది. విధి విధానాలు పాటించకుండా ఫైబర్ నెట్ ప్రాజెక్ట్‎కు చంద్రబాబు అనుమతులు ఇచ్చారని పేర్కొంది. ప్రాజెక్ట్‎ను వేమూరి హరి కృష్ణకు ఇచ్చేలా ప్రాజెక్ట్ అధికారులపై ఒత్తిడి తెచ్చారని తెలిపారు సీఐడీ అధికారులు. టెండర్ల ఎస్టిమేషన్ కమిటీలో హరి ప్రసాద్‎ను నియమించాలని చంద్రబాబు ఒత్తిడి తెచ్చారని ఆరోపించింది. వేమూరి హరి కృష్ణ టేరాసాఫ్ట్ కంపెనీనీ బ్లాక్ లిస్ట్‎లో నుంచి తొలగించాలని ఒత్తిడి తెచ్చి టేరా సాఫ్టు‎కు ఈ ప్రాజెక్ట్ వచ్చేలా ప్లాన్ చేశారని పేర్కొంది. మిగతా కంపెనీలు టెండర్ దాఖలు చేసిన వాళ్ళని కాదని వేమూరి హరి కృష్ణకు టెండర్ దక్కేలా చేశారని చెప్పింది.

సీనియర్ ఐఏఎస్ అధికారి టెండర్ ప్రక్రియలో అక్రమాలపై చర్యలు తీసుకోవాలని చూస్తే అతన్ని ట్రాన్స్ఫర్ చేశారని తెలిపింది. ఫైబర్ నెట్ కేసులో చంద్రబాబుకు ఎసిబి కోర్టు, ఏపీ హై కోర్టు ముందస్తు బెయిల్‎ను తిరస్కరించింది. చంద్రబాబు ప్రస్తుతం సుప్రీం కోర్టులో ఫైబర్ నెట్ కేసుపై స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేసినట్లు సీఐడీ తన ఛార్జ్ షీట్‎లో పొందుపరిచింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+