వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఎంపీ మాధవ్ వీడియో కేసు - సీఐడీ కేసు : టీడీపీ కీలక నేత ఫిక్స్..!!

|
Google Oneindia TeluguNews

రెండు తెలుగు రాష్ట్రాలతో పాటుగా జాతీయ స్థాయిలో సంచలనం రేపిన వైసీపీ గోరంట్ల మాధవ్ వీడియో వ్యవహారంలో సీఐడీ కేసు నమోదైంది. మాధవ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు సీఐడీ కేసు నమోదు చేసి.. ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. కుట్రపూరితంగా వ్యవహరించడం, దుష్ప్రచారానికి ఒడిగట్టి గౌరవానికి భంగం కలిగించడం, ఫోర్జరీకి పాల్పడిన అభియోగాలపై ఐటీ, ఐపీసీలోని ఫోర్జరీ చట్టాల కింద కేసు నమోదు చేసినట్టు మంగళవారం పేర్కొన్నారు. మార్ఫింగ్‌ వీడియోల ద్వారా హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్‌ ప్రతిష్టకు భంగం కలిగించిందన్న ఫిర్యాదుపై టీడీపీ సోషల్‌ మీడియా విభాగంపై కేసు నమోదు అయింది.

టీడీపీ సోషల్ మీడియా నుంచే

టీడీపీ సోషల్ మీడియా నుంచే


టీడీపీ అధినేత ఆధ్వర్యంలో నడిచే సోషల్ మీడియా విభాగం ఉద్దేశ పూర్వకంగా తన ప్రతిష్ఠకు భంగం వాటిల్లేలా వ్యవహరించిందని ఎంపీ మాధవ్ ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ ఫిర్యాదు ఆధారంగా సీఐడీ అధికారులు ఐ-టీడీపీ' తో పాటుగా మరికొందరిపై ఐటీ(66టి), ఐపీసీ 465, 469, 471, 153(ఎ), 505(2), 120(బి) సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఎంపీ మాధవ్ పేరుతో ఒక వీడియో రాజకీయంగా పెద్ద ఎత్తున చర్చకు కారణమైంది. ఎంపీ ఫిర్యాదు ఆధారంగా విచారించిన అనంతపురం పోలీసులు దానిని మార్ఫింగ్ గా నిర్దారించారు. అయ్యింది. ఆ మార్ఫింగ్‌ వీడియోను ఐ-టీడీపీ సోషల్‌ మీడియా గ్రూప్‌ తొలుత సోషల్‌ మీడియా ద్వారా వైరల్‌ చేసినట్టు పోలీసులు అధికారికంగా నిర్దారించారు.

సీఐడీ విచారణలో చిక్కుకొనేదెవరు

సీఐడీ విచారణలో చిక్కుకొనేదెవరు

అయితే, ఆ వీడియో అసలైనదేనని అమెరికాకు చెందిన 'ఎక్లిప్స్‌ ఫోరెన్సిక్‌ ల్యాబొరేటరీ' నిర్ధారించినట్టుగా టీడీపీ నేతలు వెల్లడించారు. ఎక్లిప్స్‌ ల్యాబరేటరీ జారీ చేసినట్టుగా ఓ సర్టిఫికెట్‌ను కూడా విడుదల చేశారు. కాగా, ఫోరెన్సిక్‌ సర్టిఫికెట్‌ అంశాన్ని పరిశీలించాలని ప్రభుత్వం సీడీఐ విభాగాన్ని ఆదేశించింది. దాంతో సీఐడీ అధికారులు అమెరికాలోని ఎక్లిప్స్‌ ఫోరెన్సిక్‌ ల్యాబొరేటరీని సంప్రదించగా తమకు వచ్చిన సమచారానని సీఐడీ పోలీసులు బయట పెట్టారు. ఆ వీడియో అసలైందేనని తాము ఎలాంటి సర్టిఫికెట్‌ జారీ చేయలేదని ఆ ల్యాబొరేటరీ స్పష్టం చేసింది. ఓ సెల్‌ఫోన్‌లో ప్లే చేస్తున్న వీడియోను మరో సెల్‌ ఫోన్‌ ద్వారా రికార్డు చేసిన క్లిప్‌ను మాత్రమే ప్రసాద్‌ పోతిని అనే వ్యక్తి తమకు పంపినట్టుగా తెలిపింది.

టీడీపీ నేతలే వెనుక ఉన్నారంటూ

టీడీపీ నేతలే వెనుక ఉన్నారంటూ

ఒక క్లిప్‌ను మూడో వ్యక్తి సెల్‌ఫోన్‌ నుంచి రికార్డు చేసిన వీడియోను పరిశీలించి నిర్ధారించలేమని కూడా సీఐడీ విభాగానికి పంపిన ఈ మెయిల్‌లో స్పష్టం చేసిందని అధికారులు వివరించారు. ఆ ల్యాబ్ రిపోర్టును టాంపర్ చేసి టీడీపీ అధికారులు బయట పెట్టటం పైన సీఐడీ అధికారులు ఫోకస్ పెట్టినట్లుగా సమాచారం. దీంతో..ఈ కేసులో ఇప్పుడు టీడీపీకి చెందిన నేతలతో పాటుగా ఆ పార్టీ ఆధ్వర్యంలో నడుస్తున్న సోషల్ మీడియా కు నాయకత్వం వహిస్తున్న ఒక ముఖ్య నేతకు ఇబ్బందులు తప్పవనే చర్చ రాజకీయంగా మొదలైంది. ఇప్పుడు ఈ వ్యవహారంలో సీఐడీ వేసే అడుగులు కీలకం కానున్నాయి.

English summary
AP Cid Registered FIR Against TDP Social media and others on Gorantal Madhav Video episode.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X